Satyabhama Serial Today December 05 Highlights :మహదేవయ్యకి అనుకూలంగా DNA రిపోర్ట్.. మరో షాక్ ఇచ్చిన సత్య - సత్యభామ డిసెంబరు 05 ఎపిసోడ్ హైలెట్స్!
మైత్రి బర్త్ డేకి వెళ్లాలని ఫిక్సైన హర్ష..ఆఫీసులో పని ఎక్కువగా ఉంది లేటవుతుందని తల్లికి చెబుతాడు. నాకెందుకు చెప్తున్నావ్ నీ భార్యకు కదా చెప్పాలంటుంది విశాలాక్షి. ఏంటి అని నందిని అంటే ..తనకి అబద్ధం చెప్పి వెళ్లిపోతాడు.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appఇంట్లోనే గంగకు సపోర్ట్ ఉంది..అందుకే నీ ఫొటో ఆమెకు వెళ్లిందనే డౌట్ అడుగుతాడు క్రిష్ ఫ్రెండ్. అది నిజమే అయి ఉండొచ్చని అనుమానపడతాడు. ఇంతలో ఓ SIని అడిగి గంగ ఇంటి అడ్రస్ తీసుకున్న క్రిష్ ఆమె చరిత్ర తెలుసుకుంటా అని వెళతాడు..
ఇంట్లో కాలుమీద కాలేసుకుని కూర్చున్న భైరవి దగ్గరకు వచ్చిన గంగ కూడా అలానే కూర్చుంటుంది. ఇకనుంచి నీకు కొత్తమ్మను నేనే నా దగ్గర పనిచేయాలంటూ పనిమనిషిని బెదిరిస్తుంది గంగ. భైరవి ఆవేశంగా అక్కడి నుంచి వెళ్లిపోతుంది
కాసేపట్లో రిపోర్ట్స్ వస్తాయి..నాకు అనుకూలంగా ఎలాగూ రావు నేను ఇక్కడే ఉంటే నా పనైపోతుందంటుంది గంగ. నేను ఓమాట చెబుతాను విను అంటుంది సత్య..
మరోవైపు గంగ అడ్రస్ వెతుక్కుని వెళతాడు క్రిష్. అక్కడవాళ్లని గంగ గురించి ఆరాతీస్తాడు.. ఆమె గంగ కాదు శ్రావణి నాటకాలు వేస్తుంటుందని చెబుతారు ఆ చుట్టుపక్కలవాళ్లు. అప్పుడు ఇంటి తాళం పగలగొట్టి లోపలకు వెళ్లి అక్కడున్న ఫొటోలకు ఫొటోస్ తీస్తాడు..ఇక గంగ పనైపోయింది అనుకుంటాడు క్రిష్.
ఇల్లంతా సైలెంట్ గా ఉండడంతో జయమ్మ..ఎందుకీ నిశ్శబ్ధం అని అడుగుతుంది. తప్పు చేయనప్పుడు భయం ఎందుకు అంటుంది భైరవి. ఆ మాట నీ మావయ్యని చెప్పమను అని సత్యతో అంటుంది.రిపోర్ట్ ఏమైందని ఆరాతీస్తుంది భైరవి.. ఇంతలో రిపోర్ట్ రానే వస్తుంది
రిపోర్ట్ తో పాటూ మీడియా, మహిళాసంఘాలు, ప్రత్యర్థి పార్టీల సభ్యులు మొత్తం దిగుతారు. రిపోర్ట్ అందరి ముందూ చదవాలని డిమాండ్ చేస్తారు. గంగను రమ్మని భైరవి పిలుస్తుంది.. సరే అన్న గంగ..అంతా బయటకు వెళ్లాక అక్కడి నుంచి తప్పించుకుని వెళ్లిపోతుంది.
క్రిష్ కి కాల్ చేసిన సత్య..రిపోర్ట్ వచ్చిందని చెబుతుంది. గంగ అక్కడే ఉందా అని అడుగుతాడు..దాని గురించి మొత్తం తెలుసుకున్నా అని చెబుతాడు. సత్యలో టెన్షన్ మొదలవుతుంది..కాల్ కట్ చేసేస్తుంది. నువ్వు తెలుసుకున్న నిజం కన్నా అతి పెద్ద నిజం నీకోం ఎదురుచూస్తోంది అనుకుంటుంది
సత్యభామ డిసెంబర్ 06 ఎపిసోడ్ లో..నేను చిన్నా కన్నతండ్రిని కాదనే నిజాన్ని నీకు నువ్వే గొయ్యితీసి పాతిపెట్టావ్ అంటాడు మహదేవయ్య. మీకు గెలుపు ఇచ్చిన సంతోషానికి ఆయుష్షు తక్కువ..కొద్దిగంటల్లో ఆ సంతోషాన్ని దేవుడు లాక్కుంటాడు అంటూ షాక్ ఇస్తుంది సత్య