Satyabhama Serial Today December 03 Highlights : సత్య చేతిలో DNA రిపోర్ట్..మహదేవయ్య ఏం చేయబోతున్నాడు - సత్యభామ డిసెంబరు 03 ఎపిసోడ్ హైలెట్స్!
గంగ లెక్క తేల్చేస్తానని క్రిష్ ఫైర్ అవుతాడు..కంట్రోల్ చేసిన మహదేవయ్య నేను చూసుకుంటాను నువ్వెళ్లు అని పంపిస్తాడు.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appఅప్పుడు ఎంట్రీ ఇచ్చిన సత్యకు వార్నింగ్ ఇచ్చేందుకు ప్రయత్నిస్తాడు మహదేవయ్య. కానీ మోసం చేసిన గంగని చంపేస్తానంటున్నాడు నా భర్త.. నిజానికి మోసం చేసింది మీరే అని తెలిస్తే ఎలా ఉంటుందో ఊహించుకోండని వార్నింగ్ ఇచ్చి వెళ్లిపోతుంది
మహదేవయ్య తీరు చూసి క్రిష్ కన్నీళ్లు పెట్టుకుంటే సత్య ఓదార్చుతుంది. బాపూ ఎందుకు నామాట లెక్కచేయడంలేదు..పరాయివాడిగా చూస్తున్నాడని అంటే.. పరాయివాడివే అంటుంది సత్య. వెటకారం వద్దు సత్యా..గంగ మేటర్లో ఎందుకింత కూల్ గా ఉన్నాడు అంటాడు. నీ గుండెలపై పచ్చబొట్టు వేయించుకున్నంత మాత్రాన అన్నీ నీకు చెప్పాలని లేదుకదా అంటాడు..
బయటకు కూల్ గా ఉన్నా లోలోప మధనపడుతున్నారని నీకు తెలియదు కదా.. అసలు ఆ గంగకి అంత ధైర్యం ఏంటి? తనవెనుక ఎవరున్నారని ఆరాలు మొదలుపెడతాడు..అయితే నీ బాధ తగ్గించే ఆయుధం నా దగ్గరుంది కానీ చెప్పేం టైమ్ రాలేదనుకుంటుంది సత్య
మైత్రి హర్షకి కాల్ చేస్తుంది కానీ కట్ చేస్తాడు. ఇంతలో తన ఫ్రండ్ వచ్చి..నీకోసం చాలా చేశాడు..ఇక తనని వదిలెయ్ అంటుంది. దీనికి అంతటికీ కారణం నందిని అని ఫైర్ అవుతుంది మైత్రి. హర్ష నన్ను ప్రేమించకపోతే నాకోసం ఇదంతా ఎందుకు చేస్తాడని అంటుంది. హర్షని నా దార్లోకి తెచ్చుకుంటా..నా పుట్టినరోజుని వాడుకుంటా చూడు అంటుంది
భైరవి నగలు సింగారించుకున్న గంగ..ఇన్ని నగలున్నాయని తెలిస్తే ఎప్పుడో వచ్చేదాన్ని అంటుంది. నా అనుమతి లేకుండా నా గదిలోకి ఎందుకు వచ్చావ్ అని నిలదీస్తుంది భైరవి. మన మొగుడు ఇద్దరికీ సమానం అంటూ భైరవిని రెచ్చగొడుతింది..
ఇంతలో సత్య రావడంతో..నా నగలు తీసుకుంది చూడు అంటుంది. సత్య బతిమలాడడంతో గంగ ఐదు నిముషాల్లో తీసిస్తాలే అంటుంది.
మరోవైపు పోలీసులకు కాల్ చేసిన మహాదేవయ్య DNA రిపోర్ట్ విషయంలో లంచం ఇస్తాను తనకు అనుకూలంగా రావాలని కోరుతాడు..పోలీసులు నో చెబుతారు..పొలిటికల్ సపోర్ట్ కోసం చూసినా పనిజరగదు.
ఇంతలో ఎంట్రీ ఇచ్చిన సత్య... కలికాలం ఇలానే ఉంటుందంటుంది.. ఇప్పుడు మీకు సపోర్ట్ చేసేది నేనుమాత్రమే అంటుంది..మహదేవయ్య ఆలోచనలో పడతాడు
సత్యభామ డిసెంబరు 04 ఎపిసోడ్ లో DNA రిపోర్ట్ వచ్చేసింది.. మీడియా ప్రతినిధుల ముందు ఆ రిపోర్ట్ ఓపెన్ చేయాలనే డిమాండ్స్ వినిపిస్తాయి. ఓ డాక్టర్ రిపోర్ట్ చదవడం ప్రారంభిస్తాడు...క్రిష్ విషయంలో మహదేవయ్యని సత్య కాపాడిందో లేదో క్లారిటీ వచ్చేస్తుంది...