Sobhita Dhulipala : పెళ్లికూతురు లుక్‌లో శోభిత ధూళిపాల ఎలా సిగ్గుపడుతుందో చూశారా? ఇక నాగచైతన్య రావడమే ఆలస్యం
శోభిత ధూళిపాలను చూస్తే పెళ్లి కల వచ్చేసిందే బాలా అంటారు. ఎందుకంటే పెళ్లి సమయం దగ్గర పడుతున్న వేళ ఆమెను పెళ్లికూతురును చేశారు ఆమె ఇంటి సభ్యులు.(Images Source : Instagram/sobhita dhulipala)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appఈ ఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేసి.. Pelli Kuthuru ♥️ అంటూ క్యాప్షన్ ఇచ్చింది శోభిత. రెడ్ శారీలో పొడవాటి చేతులు వచ్చిన బ్లౌజ్ వేసుకుని.. గోల్డెన్ జ్యూవెలరీ ధరించి అందంగా ముస్తాబైంది శోభిత. (Images Source : Instagram/sobhita dhulipala)
శోభిత పెళ్లికూతురు కార్యక్రమంలో ఆమె చెల్లి సమంత.. అతని భర్త కూడా పాల్గొన్నారు. వారితో కలిసి శోభితా ఫోటోలకు నవ్వుతూ ఫోజులిచ్చింది. (Images Source : Instagram/sobhita dhulipala)
పెళ్లికూతురును చేసే కార్యక్రమంలో భాగంగా కాళ్లకు పసుపు రాస్తోన్న ఫోటోను అభిమానులతో పంచుకుంది. కాళ్లకు పట్టీలు పెట్టుకుని.. అచ్చమైన తెలుగింటి అమ్మాయిగా ముస్తాబైంది శోభిత. (Images Source : Instagram/sobhita dhulipala)
నాగచైతన్య, శోభిత పెళ్లి మరో రెండ్రోజుల్లో జరగనుంది. అన్నపూర్ణ స్టూడియోస్‌లో వీరి వివాహం జరగనుంది. వివాహ తంతు 8 గంటలు ఉంటోందట. (Images Source : Instagram/sobhita dhulipala)
Andaniki andam ee puttadi bomma❤️ అంటూ ఓ అభిమాని ఈ ఫోటోలకు కామెంట్ పెట్టాడు. మరికొందరు కంగ్రాట్స్ చెప్తూ ఫోటోలకు లైక్స్ కొడుతున్నారు. (Images Source : Instagram/sobhita dhulipala)