Karthika Deepam 2 March 10th Highlights : తాతగారి ఆస్తి అవసరం లేదన్న కార్తీక్, తల్లిది కూడా అదే మాట.. శ్రీధర్ మాత్రం ప్రయత్నాలు ఆపట్లేదుగా, కార్తీక దీపం 2 ఈరోజు హైలెట్స్
కార్తీక్, దీప, కాంచన అందరూ మాట్లాడుకుంటుంటే శ్రీధర్ కావేరి అక్కడికి వస్తారు. శ్రీధర్ మాటలు పట్టించుకోకుండా కాంచన కావేరికి కూర్చీ వేయమంటుంది. (Image Credit: Jiostar/ Star Maa)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appమరోపక్క శ్రీధర్.. అక్కడ మీ తాత వీలునామా రాయిస్తున్నాడు. మీరు పట్టించుకోకుంటే మీకు నష్టం వస్తుందని చెప్తాడు. త్వరగా వెళ్దాము పదండి. నేను మాట్లాడతాను అని చెప్తాడు.(Image Credit: Jiostar/ Star Maa)
ఆస్తి అవసరం లేదనుకునే వచ్చాము.. మాకేమి వద్దు అని కార్తీక్ అంటాడు. నా కొడుకు సమర్థుడని.. తాను సంపాదించుకుంటాడని కాంచన చెప్తుంది. మీకు అర్థం కావట్లేదే పిచ్చివాళ్లరా అనుకుంటూ శ్రీధర్ వెళ్లిపోతాడు. (Image Credit: Jiostar/ Star Maa)
ఇంటికి వెళ్లిన తర్వాత కావేరి శ్రీధర్ మనసులోని మాటలు బయటకు చెప్తుంది. అక్కపేరుతో ఆస్తి వస్తే.. తను తీసుకోదు కాబట్టి మీరు కొట్టేయాలనుకుంటున్నారు కదా అని చెప్తుంది.(Image Credit: Jiostar/ Star Maa)
తన మనసులోని మాటలు కావేరి బయటకు చెప్పడంతో శ్రీధర్ నోరెళ్లబెట్టి షాక్ అవుతాడు. ఆస్తి గురించి ఆలోచిస్తే కార్తీక్‌కి చెప్పేస్తా అంటూ కావేరి భయపెడుతుంది.(Image Credit: Jiostar/ Star Maa)
రెస్టారెంట్‌కి సత్యరాజ్ వచ్చి శ్రీధర్, దీపలను మెచ్చుకుంటాడు. ఫుడ్ ఎలా ఉందో టేస్ట్ చూస్తానని చెప్తాడు. అంతేకాకుండా రెస్టారెంట్‌కి పూర్వ వైభవం తీసుకొచ్చారని చెప్తాడు. (Image Credit: Jiostar/ Star Maa)
దీప, కార్తీక్ సంతోషంగా ఫీల్ అవుతారు. మళ్లీ కార్తీక్ ప్రాణదాత టాపిక్ తీయడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ముగిసింది. (Image Credit: Jiostar/ Star Maa)