Karthika Deepam 2 January 28th Highlights : కార్తీకదీపం 2 సీరియల్ హైలైట్స్.. శౌర్యని కాపాడమంటూ కార్తీక్‌ని బతిమాలిన దీప, రేపే ఆపరేషన్

కార్తీకదీపం సీరయల్ ఈరోజు ఎమోషనల్‌గా సాగింది. కార్తీక్ ఇంటికి వచ్చేసరికి దీప ఏడుస్తూ మూలన కూర్చొని ఉంటుంది. (Image Credit: Disney Plus Hotstar/ Star Maa)
Download ABP Live App and Watch All Latest Videos
View In App
శౌర్యతో పాపను చూడాలని దీప పట్టుబడడంతో కార్తీక్ దీపకు నిజం చెప్పేస్తాడు. శౌర్య హాస్పిటల్లో ఉందని చెప్పేసరికి దీప షాక్ అవుతుంది. (Image Credit: Disney Plus Hotstar/ Star Maa)

కార్తీక్ కాలర్ని పట్టుకుని నా కూతురుని ఏమి చేశారు. నన్ను ఎందుకు మోసం చేశారంటూ నిలదీసింది. కార్తీక్ సైలెంట్ అయిపోతాడు. (Image Credit: Disney Plus Hotstar/ Star Maa)
నా కూతురు గురించి నాకు చెప్పకుండా ఎందుకు ఇలా చేశారు. నా కూతురుకి ఏమి కాలేదు చిన్న సమస్యే అని చెప్పారుగా అంటూ కార్తీక్‌ని నిలదీస్తుంది దీప.(Image Credit: Disney Plus Hotstar/ Star Maa)
దీంతో అనసూయ కల్పించుకుని కార్తీక్‌ని నిలదీసే హక్కు నీకు లేదు. కన్నా కూతురు కాకపోయినా.. తండ్రిగా తాను చేయాల్సినవన్నీ చేస్తున్నాడు.(Image Credit: Disney Plus Hotstar/ Star Maa)
ఆపరేషన్ డబ్బుల కోసం సైకిల్ తొక్కుతూ ఊరంతా తిరుగుతున్నాడు. అప్పు దొరకట్లేదని పిచ్చొడిలా చీకటిలో ఏడుస్తున్నాడు. నీకు తెలిస్తే బాధపడతావని ఆ కన్నీటిని నీ ముందు చూపించట్లేదంటూ చెప్తుంది. (Image Credit: Disney Plus Hotstar/ Star Maa)
దీంతో దీప కార్తీక్ కాళ్లు పట్టుకుని తన కూతురుని కాపాడమంటూ వేడుకుంటుంది. శౌర్యని బతికించి తీసుకొచ్చే బాధ్యత తనది అంటూ చెప్తాడు కార్తీక్. (Image Credit: Disney Plus Hotstar/ Star Maa)
రేపే ఆపరేషన్‌కి డబ్బులు కట్టాలని.. చేతిలో డబ్బుల్లేవని చెప్తాడు. తాను దాచుకున్న డబ్బులు తెచ్చి ఇస్తే ఇవి సరిపోదని.. ఆపరేషన్‌కి 50 లక్షలు కావాలని చెప్తాడు. (Image Credit: Disney Plus Hotstar/ Star Maa)