Satyabhama Serial Today January 28th Highlights: సంజయ్ తో సత్య సవాల్.. నిలదీసిన క్రిష్ తో నిజం చెప్పేస్తుందా - సత్యభామ జనవరి 28ఎపిసోడ్ హైలెట్స్!

తన ప్రేమ విషయం అక్కకి తెలిసిపోయిందని..తనకి ఎలక్షన్స్ లో సపోర్ట్ చేయలేదని కక్ష తీర్చుకుంటుందని సంధ్య టెన్షన్ పడుతుంది.
Download ABP Live App and Watch All Latest Videos
View In App
ఇంతలో సంజయ్ కాల్ చేసి మీ అక్క నాకు వార్నింగ్ ఇచ్చింది...ఇప్పుడే మీ ఇంటికి బయలుదేరిందని చెబుతాడు. మా పెదనాన్న మన పెళ్లికి ఒప్పుకున్నాడని చెప్పి..నువ్వు సునామీని ఎదిరించేందుకు సిద్ధంగా ఉండు అని రెచ్చగొడతాడు. మీ అక్క ఎన్నికల్లో పోటీచేయకుండా నువ్వే ఆపాలని ...పెదనాన్న కండిషన్ చెప్తాడు.

ఇంటికి వచ్చిన సత్య.. సంధ్యని పిలుస్తుంది. ఏమైందని ఇంట్లో అంతా అడిగితే...సంధ్య వస్తే తేలుస్తా అంటుంది. ఇది మనకు నమ్మక ద్రోహం చేస్తోందని సంజయ్ తో ప్రేమ విషయం బయటపెడుతుంది.
సంజయ్ ని ప్రేమిస్తున్నా పెళ్లి చేసుకుంటా.. నేను చేసింది తప్పు అయితే అక్క-బావగారు ప్రేమించి పెళ్లిచేసుకున్నారు వాళ్లది తప్పా అని రివర్సవుతుంది సంధ్య. సంజయ్ కరెక్ట్ కాదని సత్య అంటే..తన గురించి తప్పుగా మాట్లాడితే ఊరుకోను అంటుంది సంధ్య .
సంజయ్ అన్న తప్పుడు మనిషి అని నీకు ఎలా తెలుసు అని నందిని అడుగుతుంది..నాతో చెడుగా ప్రవర్తిస్తే ఓసారి కొట్టాను. అప్పటి నుంచి నా పై పగ పెంచుతుని నీతో ప్రేమ నాటకం ఆడుతున్నాడని చెబుతుంది. సంధ్యను వేధిస్తాడని కూడా చెబుతుంది. కానీ ఇదంతా నీ నాటకం అని కొట్టిపడేస్తుంది సంధ్య
అక్క గురించి సంజయ్ నాకు ముందే చెప్పాడంటుంది సంధ్య. నిన్ను నిజంగా ప్రేమిస్తే నేను ఎన్నికల్లో తప్పుకోవాలనే కండిషన్ ఎందుకు పెడతారు.. వాళ్ల స్వార్థానికి నిన్ను బలిచేస్తున్నారని అంటుంది సత్య. సంధ్య మాత్రం తగ్గేదేలే అనేస్తుంది.
సంధ్యని రెచ్చగొట్టానంటూ సంజయ్ ..మహదేవయ్యకి చెప్పి స్వీట్స్ ఇస్తాడు. ఇద్దరూ ఎంజాయ్ చేస్తారు. ఇంతలో ఇంట్లో అంతా అక్కడకు వచ్చి ఏంటి స్పెషల్ అని అడుగుతారు. సత్య చెల్లి సంధ్యతో సంజయ్ ప్రేమలో పడ్డాడని చెబుతాడు మహదేవయ్య. సత్యకి ఈ విషయం తెలుసా అని క్రిష్ అంటే..మాట్లాడేందుకు వాళ్లింటికి వెళ్లిందంటాడు సంజయ్
ఇంతలో సత్య రావడంతో స్వీట్స్ ఇస్తాడు సంజయ్. కిందపడేసిన సత్య.. ఓడిన వాడు మళ్లీ గెలవొచ్చు కానీ దిగజారిన వాడు ఎందుకూ పనికి రాడు అంటుంది. సంధ్యతో నీ పెళ్లి జరగదు అంటుంది. మమ్మల్ని విడదీయోద్దని సంజయ్ డ్రామా స్టార్ట్ చేస్తాడు. ఇదే అవకాశంగా రుద్ర ..సత్యపై ఫైర్ అవుతాడు.
సత్యభామ జనవరి 29 ఎపిసోడ్ లో.. సత్యను ఒప్పించే ప్రయత్నం చేస్తాడు క్రిష్. ఏదేమైనా ఒప్పుకునేదే లేదంటుంది సత్య. కారణం చెప్పమంటాడు క్రిష్.. సత్య ఆలోచనలో పడుతుంది