Vijayasai Reddy Photos: తన రాజీనామాతో ఏపీలో సెగలు రేపి, హాయిగా సేదతీరుతున్న విజయసాయిరెడ్డి
వైసీపీ నేత విజయసాయిరెడ్డి ఇటీవల సంచలన నిర్ణయం తీసుకున్నారు. రాజీకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. ఆ మరుసటి రోజే ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్‌కు తన రాజీనామా లేఖను సమర్పించారు.
రాజ్యసభ్య సభ్యత్వానికి రాజీనామా చేస్తూ వైఎస్సార్ సీపీ నేత విజయసాయిరెడ్డి సమర్పించిన లేఖను ఉపరాష్ట్రపతి అదేరోజు ఆమోదించడంతో ఆ స్థానంపై కూటమిలో పోటీ నెలకొంది. జగన్‌కు ఫోన్ చేసి చర్చించిన తరువాతే తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు విజయసాయిరెడ్డి ప్రకటించారు.
తన ఎంపీ పదవికి రాజీనామాతో ఏపీ రాజకీయాల్లో సెగలు రేపిన విజయసాయిరెడ్డి రెండో ఇన్నింగ్స్ ప్రారంభించి హాయిగా సేదతీరుతున్నారు. అందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో షేర్ చేయగా వైరల్ అవుతున్నాయి.
విజయసాయిరెడ్డి ప్రస్తుతం హార్టికల్చర్ పనుల్లో బిజీ అవుతున్నారు. ఇందులో భాగంగా పూల మొక్కలు, పండ్ల మొక్కలు, ఉద్యానవనం పనులతో సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టారని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. రాజకీయాల నుంచి తప్పుకుంటున్న మాజీ ఎంపీ ఎంతో సంతోషంగా కనిపించారు.
రెండు రోజుల కిందట ఢిల్లీకి వెళ్లి రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసిన విజయసాయిరెడ్డి. ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్‌కు లేఖను సమర్పించగా ఆయన ఆమోదం తెలిపారు.