Karthika Deepam 2 February 14th Highlights : కార్తీక్, దీప మధ్య క్యూట్ రొమాన్స్.. శ్రీధర్, జ్యోత్స్నలకు క్యాటరింగ్ చేస్తూ కనిపించిన కార్తీక్, కార్తీక దీపం 2 ఈరోజు హైలెట్స్ ఇవే

కార్తీక్, దీపలు వెళ్లిన తర్వాత కార్తీక్ ఇచ్చిన బాండ్ పేపర్లను శ్రీధర్ వెతుక్కుంటాడు. దీంతో కావేరి అవి వెతుక్కోకండి ఎప్పటికి కనిపించవని చెప్తుంది. (Image Credit: Disney Plus Hotstar/ Star Maa)
Download ABP Live App and Watch All Latest Videos
View In App
శౌర్య చదువుకుంటుండగా దీప పక్కనే కూర్చొని ఏవో లెక్కలు వేస్తుంది. దీంతో శౌర్య ఏమి చేస్తున్నావని అడగ్గా నీకు ఎందుకు పని చూసుకోమని చెప్తుంది. (Image Credit: Disney Plus Hotstar/ Star Maa)

ఇదంతా వెనకనుంచి చూసిన కార్తీక్ ఏమి చేస్తుంది మీ మమ్మీ అని అడుగుతాడు. నేను అడిగితే చెప్పట్లేదు అంటే.. శౌర్యని లోపలికి వెళ్లిపోమని చెప్తాడు కార్తీక్.(Image Credit: Disney Plus Hotstar/ Star Maa)
దీప పక్కన కూర్చోని ఏమి చేస్తున్నావని అడుగ్గా.. మనముందున్న అప్పులను చిట్టీలు వేసి తీర్చేద్దామంటూ చేప్తుంది దీప. (Image Credit: Disney Plus Hotstar/ Star Maa)
ఈలోపు గంగాధర్ వచ్చి.. ఓ ఫంక్షన్‌కి క్యాటరింగ్ కావాలని అడ్వాన్స్ పదివేలు ఇస్తాడు. కార్తీక్ చేద్దామంటూ డబ్బులు తీసుకుంటాడు. కానీ దీప అయిష్టంగానే ఒప్పుకుంటుంది. (Image Credit: Disney Plus Hotstar/ Star Maa)
కాంచన, దీప, కార్తీక్ అందరూ కలిసి మొత్తం రెడీ చేస్తారు. కార్తీక్‌ని ఈ పొజిషన్లో చూసి కాంచన బాధపడుతుంది. (Image Credit: Disney Plus Hotstar/ Star Maa)
క్యాటరింగ్ కోసం సామాన్లు సర్దుతూ.. కార్తీక్, దీప మధ్య లిటిల్ రొమాన్స్ నడుస్తుంది. ఇద్దరూ కలిసి ఫంక్షన్‌కి వెళ్తారు. (Image Credit: Disney Plus Hotstar/ Star Maa)
మీరే వడ్డించేయండి ఎక్కువ డబ్బులు ఇస్తానంటూ చెప్తే.. కార్తీక్ దానికి కూడా ఒప్పుకుంటాడు. దీపకు తప్పక కార్తీక్‌కి హెల్ప్ చేస్తూ.. వడ్డిస్తారు.(Image Credit: Disney Plus Hotstar/ Star Maa)
ఇదే సమయానికి అదే ఫంక్షన్‌కి శ్రీధర్, పారిజాతం, జ్యోత్స్న వస్తారు. వడ్డిస్తున్న కార్తీక్‌ని చూసి షాక్ అవ్వడంతో ఈ రోజు ఎపిసోడ్ ముగిసింది. (Image Credit: Disney Plus Hotstar/ Star Maa)