Guppedantha Manasu August 7th Episode: ఎపుడూ లేని ఈ సంతోషాన్ని దాచాలంటే మది చాలో లేదో - 'గుప్పెడంత మనసు' జంట క్యూట్ మూమెంట్స్!
రిషి..రంగాలా మారి తిరికి వచ్చాక గుప్పెడంతమనసు సీరియల్ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది. రిషిలా వసుకి దగ్గరవుతూనే...రంగాలా శైలేంద్రకి అనుమానం రాకుండా నటిస్తున్నాడు. ఆగష్టు 07 ఎపిసోడ్ లో రిషిధార ప్రేమసంగతులు ఇవే..
Download ABP Live App and Watch All Latest Videos
View In Appకాలేజీ క్యాబిన్ లోకి అడుగుపెట్టిన రిషి, వసుధారలు ఒక్కసారిగా పాత జ్ఞాపకాల్లోకి వెళ్లిపోతారు. అక్కడున్న హార్ట్ సింబల్ తీసి రిషి దానికి సంబంధించిన జ్ఞాపకాలన్నీ గుర్తుచేసుకుంటాడు
వసుధార కూడా ఆ హార్ట్ సింబల్ చేతిలోకి తీసుకుని..మీరు లేనప్పుడు..నేను బాధలో ఉన్నప్పుడు దీన్ని చూసుకుంటూ మాట్లాడుకునేదాన్ని, కాలం గడిపేదాన్ని అంటుంది
ఇద్దరూ ఫస్ట్ టైమ్ కలిసినప్పటి నుంచీ టామ్ అండ్ జెర్రీలా పోట్లాడుకున్నవి...ఆ తర్వాత వసుని నువ్వు ప్రేమిస్తున్నావని జగతి గుర్తించిన విషయం అన్నీ రివైండ్ చేసుకుంటాడు రిషి...
ఇద్దరూ కలసి డాన్స్ చేసినది..చెట్టాపట్టాలేసుకుని తిరిగన క్షణాలు...ప్రేమను వ్యక్తపరచడం వరకూ అన్నీ గుర్తుచేసుకుంటారు
మొదటి నుంచే నీపై కోపం ఉండేది..అది కూడా ప్రేమతో కూడిన కోపమేనేమో...అందుకే ఒక్కరోజు నువ్వు కనిపించకపోయినా నాకు మనశ్సాంతి ఉండేది కాదు..నువ్వు కనిపిస్తే చాలు ఏదో ఒక ఎమోషన్ చూపించేవాడిని..చివరికి అదంతా ప్రేమే అని అర్థమైంది.
అమ్మ నాతో చెప్పినా కానీ నేను గుర్తించలేకపోయాను..ఆతర్వాత అర్థమైందంటూ జరిగిన కథంతా గుర్తుచేసుకుంటారు రిషిధార.. ఆ తర్వాత కాలేజీ చూసి వస్తాను చాలా రోజులైంది కదా అని వెళ్లిపోతాడు రిషి...