Guppedantha Manasu August 21sth Episode: వసు బుంగమూతి - రిషి బుజ్జగింపులు..మరోసారి బకరా అయిన శైలేంద్ర - గుప్పెడంత మనసు ఆగష్టు 21 ఎపిసోడ్!
ఎంత రెచ్చగొట్టినా మనుగాడు అలాగే ఉంటున్నాడు మామ్ అని ప్రస్ట్రేట్ అవుతాడు శైలేంద్ర. నేను వాడికి షాక్ ఇద్దాం అనుకుంటే వాడే తిరిగి నాకు షాకులమీద షాకులిస్తున్నాడంటాడు. తండ్రి ఎవరో తెలియకముందున్న ఆవేశం..తెలిసిన తర్వాత తగ్గిపోయింది..అందుకే వాడు కూల్ గా ఉండగలుగుతున్నాడని బదులిస్తుంది దేవయాని..కానీ మను విషయం ఆలోచించాల్సిందే అని కంక్లూజన్ కి వస్తుంది..
Download ABP Live App and Watch All Latest Videos
View In Appమనుకు తండ్రిని నేనేంటి..అసలేం జరిగింది? మన ముగ్గురం మంచి ఫ్రెండ్స్ కదా జగతి..ఇప్పుడు వసుధార ఆ మాట అంటే అనుపమ ఎందుకు అవునని చెబుతోంది. నా మనసులో నువ్వు తప్ప మరొకరు లేరు..ఎక్కడో ఏదో జరిగింది..దానికి మీరిద్దరే సమాధానం చెప్పాలి కానీ ఇప్పుడు నువ్వు లేవుకదా జగతి అనుకుంటాడు మహేంద్ర
అసలు మనుకి ఈ విషయం తెలుసో లేదో అని ఆలోచిస్తూ కాల్ చేస్తాడు మహేంద్ర..కానీ లిఫ్ చేయడు. నీతో మాట్లాడాలి అని మెసేజ్ చేసిని పట్టించుకోడు మను. ఎవరికి వారే మనసులో మాట్లాడుకుంటారు.. ఎందుకింత అలజడి అనుకుంటారు..
మనుకి నిజం తెలిసిపోయిందని అనుపమకు అర్థమవుతుంది. అందుకే మనుని ఫేస్ చేసేందుకు భయంభయంగా ఉంటుంది. ఇంతలో అనుపమకు కూడా మహేంద్ర కాల్ చేస్తాడు కానీ లిఫ్ట్ చేయదు. ఇలా కాదు..నేరు వెళ్లి మాట్లాడాలని ఫిక్సవతాడు మహేంద్ర...
రిషి తండ్రికి కాల్ చేసి మీరు నేను వచ్చే వరకూ ఇంట్లోనే ఉండాలని చెబుతాడు. ఇంత పెద్ద విషయం తెలిసిన తర్వాత మీరు ఇంత కూల్ గా ఎలా ఉండగలుగుతున్నారని క్వశ్చన్ చేస్తుంది వసుధార. ఏంటి అది అంటూ శైలేంద్ర ఎంట్రీ ఇస్తాడు.. వసుధారతో తిట్లు తింటాడు.. అడగుండా లోపలకు ఎలా వస్తావని కడిగిపడేస్తుంది
శైలేంద్రకు వసుధారతో సారీ చెప్పిస్తాడు రిషి... శైలేంద్రకు అనుమానం రాకుండా అలా చేశానని చెప్పి వసుని బతిమలాడి అన్నయ్యతో కలసి బయటకు వెళ్లిపోతాడు.
ఎండీ సీటు కోసం మీరు చాలా అరాచకాలు చేశారంట కదా..రిషిని కూడా చంపించేందుకు ప్లాన్ చేశారట కదా అని రంగా అంటాడు. వీడు రిషి అనుకుని వసుధార అన్నీ చెప్పేస్తోందని నవ్వుకుంటాడు శైలేంద్ర. మను గురించి రిషి ఎంక్వరీ చేసినా కానీ శైలేంద్ర నోరువిప్పడు. వాడితో జాగ్రత్తగా ఉండాలి.. మనుకి వ్యతిరేకంగా ఉండాలని చెబుతాడు
ఎవరు ఏం చెప్పినా వినేది లేదు..నిన్ను ఎండీని చేసి నా దారిన నేను వెళ్లిపోతాను అని రిషి చెప్పడంతో హమ్మయ్య అనుకుంటాడు శైలేంద్ర... ఆగష్టు 21 ఎపిసోడ్ ముగిసింది..
గుప్పెడంత మనసు ఆగష్టు 21 ఎపిసోడ్