Guppedantha Manasu End :కాలేజీ ఎండీగా ఎవర్ని ప్రకటించారో తెలుసా - గుప్పెడంత మనసు సీరియల్ కి శుభం కార్డ్!
రిషి రీఎంట్రీ ఇవ్వడంతో గుప్పెడంతమనసు సీరియల్ ఊపందుకుంది. రిషిధార జంట చూడముచ్చటగా ఉంది. ఓ వైపు రిషిలా కనిపిస్తూనే మరోవైపు రంగాలా శైలేంద్రను నమ్మిస్తున్నాడు. ఇప్పుడు స్టోరీమొత్తం కాలేజీ ఎండీ సీటు ఎవరికి దక్కుతుంది అనేదానిచుట్టూ తిరుగుతోంది
Download ABP Live App and Watch All Latest Videos
View In Appశైలేంద్ర తనను ప్రకటించమని ఆల్రెడీ రంగా రూపంలో ఉన్న రిషికి చెప్పాడు. వసుధార ట్రాప్ లో పడొద్దని హెచ్చరించాడు. మరోవైపు దేవయాని కూడా ఇక తన కొడుకు కల నెరవేరినట్టే అని ఫిక్సైపోయాడు. ఎండీగా ఎవర్ని ప్రకటించాలని వసుధారని అడిగితే..ఆమె సందేహంలో పడింది.
మహేంద్ర కొడుకు మను అన్న విషయం రివీల్ అయింది...అది తెలియాల్సింది కేవలం మహేంద్ర, మను, రిషికి మాత్రమే. సో.. ఇప్పడున్న పరిస్థితుల్లో వసుధార ఎండీ బాధ్యతలు తీసుకోదు, రిషి వద్దనుకున్నాడు, శైలేంద్రను జైలుకి పంపించడం ఖాయం... అందుకే ఎండీ సీట్ మనుకి ఇవ్వాలని కోరుతూ వసుధార అసలు విషయం చెప్పే అవకాశం ఉంది
శైలేంద్ర కుట్రలన్నీ బయటపడితే తండ్రి ఎలాగూ క్షమించడు. దేవయాని ఎప్పటిలా కాళ్లు పట్టుకుని క్షమాపణ అడిగి రిషిని కూల్ చేసే అవకాశం ఉంది. ఫణీంద్ర, ధరణి మొదట్నుంచీ మంచిగానే ఉన్నారు. మరోవైపు తన తండ్రి ఎవరో తెలిసిన తర్వాత పెళ్లిచేసుకుంటానని ఏంజెల్ కు మాటిచ్చాడు.. సో ఏంజెల్-మను పెళ్లి జరిగిపోతుంది. ఒకప్పుడు మహేంద్రని ప్రేమించి ఒంటరిగా మిగిలిపోయిన అనుపను మహేంద్రకి ఇచ్చి పెళ్లిచేసే అవకాశం ఉంది.
సరోజకూడా సిటీకి వచ్చి బావా బావా అని హడావుడి చేస్తోంది. పనిలో పనిగా రంగా ఎవరు? రిషి ఎందుకు రంగాలా మారాడు అనే విషయంపై క్లారిటీ వచ్చేస్తుంది.
పరిస్థితులన్నీ చక్కబడడంతో రిషిధారలు కొత్త ప్రయాణం ప్రారంభిస్తారని చెబుతూ సీరియల్ కి ప్రస్తుతానికి శుభంకార్డ్ వేసేయబోతున్నారు..అంటే కార్తీకదీపంలా మళ్లీ తర్వాత ఎప్పుడో కొనసాగే అవకాశం ఉంది..