Guppedantha Manasu Climax: 'గుప్పెడంతమనసు' సీరియల్ అయిపోయింది.. క్లైమాక్స్ ఎపిసోడ్ లో ముగ్గురు మొనగాళ్లు అదిరిపోయారు!
గుప్పెడంత మనసు సీరియల్ కి శుభంకార్డ్ పడింది. 1168 ఎపిసోడ్స్ సాగిన ఈ సీరియల్ ఆగష్టు 31తో ముగిసింది. కొన్ని సీరియల్స్ ఏదో మొక్కుబడిగా ముగించేసినట్టు ఉంటాయి. కానీ గుప్పెడంతమనసు విషయంలో అవసరం అయిన జాగ్రత్తలన్నీ తీసుకున్నారు మేకర్స్
Download ABP Live App and Watch All Latest Videos
View In Appప్రేక్షకులకు ఎలాంటి సందేహాలు లేకుండా సీరియల్ కి శుభంకార్డ్ వేశారు. సాధారణంగా క్లైమాక్స్ లో దుర్మార్గులకు బుద్ధివచ్చినట్టే రిషి పెద్దమ్మ దేవయాని మారిపోయింది. కామెడీ విలన్ శైలేంద్ర క్యారెక్టర్ ని ఫుల్ లెంగ్త్ కామెడీగా మార్చేశాడు రిషి...
తండ్రి ఎవరో తెలియదని నిందలు పడుతూ తనలో తను కుమిలిపోయిన మనుకి తండ్రి, సోదరుడు సహా ఓ పెద్ద కుటుంబాన్ని ఇచ్చారు. పైగా రిషిని పెళ్లిచేసుకోవాలనుకున్న ఏంజెల్ తన సోదరుడు మనుతో ప్రేమలో పడి పెళ్లిచేసుకుంది.
మంచి స్నేహితురాలుగా ఉండే అనుపమ క్యారెక్టర్ కి జరిగిన అన్యాయం ఏమీ లేదు.. మొదట్లో ఆమె ఎంట్రీ ఇచ్చినప్పుడు జగతి బదులు వచ్చింది ... మహేంద్ర-అనుపమ మధ్య ఏదో కథ నడిపిస్తారని అంతా అనుకున్నారు ...మనుకి తల్లి అనగానే మహేంద్రని అనుమానించారు. కానీ అదంతా కూడా క్లారిటీ ఇచ్చేశారు
సీరియల్ పై ఇంట్రెస్ట్ క్రియేట్ చేసిన జగతిమేడం క్యారెక్టర్ ని మధ్యలో చంపేసినా...శుభం కార్డ్ పడడానికి ఆమె రాసిన లెటర్ కారణమైంది. అసలు వాస్తవాలు రిషి వరకూ తీసుకెళ్లింది...మను జన్మరహస్యం చెప్పింది జగతి లెటరే...
మొత్తానికి క్లైమాక్స్ ఎపిసోడ్ లో ముగ్గురు మొనగాళ్లుగా మహేంద్ర-మను-రిషి అదిరిపోయారంతే...
రిషిధార నవ్వులతో సీరియల్ కి శుభంకార్డ్ పడింది...