Avani Lekhara: స్వర్ణంతో సత్తా చాటిన పారా షూటర్ అవని లేఖరా
పారిస్ లో జరుగుతున్న పారా ఒలింపిక్స్ లో భారత మహిళా షూటర్ అవని లేఖర అదరగొట్టింది. మహిళల 10మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో స్వర్ణం సాధించింది.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2024 పారాలింపిక్స్ లో ఇండియాకు ఇదే తొలి మెడల్. అవని 2020 పారా ఒలింపిక్స్ లో షూటింగ్ విభాగంలో ఒక పసిడి, ఒక కాంస్యం సాధించింది.
అవని చారిత్రాత్మక ప్రదర్శనపై ప్రధాని నరేంద్ర మోడీ సోషల్ మీడియా ద్వారా అభినందనలు తెలిపారు.
పారా ఒలింపిక్స్ లో మూడు పతకాలు సాధించిన తొలి భారత మహిళా అథ్లెట్ గా ఆమె అంకితభావం భారత్ గర్వపడేలా చేస్తోందన్నారు.
ఆద్యంతం ఉత్కంఠ రేపిన ఫైనల్లో తొలుత అవని వెనకబడింది. అయితే.. తొలి రౌండ్ నుంచి ముందంజలో ఉన్న దక్షిణ కొరియా పారా షూటర్ లీ యున్రీ ఆఖరి రౌండ్లో తడబడటంతో భారత పారా షూటర్ పసిడి వెలుగులు విరజిమ్మింది.
2001 నవంబర్ 8న రాజస్థాన్ రాజధాని జైపూర్‌లో అవని జన్మించింది. పదకొండేళ్ల వయసులో కారు ప్రమాదం కారణంగా అవని వీల్ ఛైర్‌కే పరిమితం అయ్యింది.
తండ్రి ప్రోత్సాహంతో షూటింగ్ అకాడమీలో చేరిన ఆమె 2015లో తొలిసారిగా నేషనల్ ఛాంపియన్‌షిప్‌లో పాల్గొంది. తర్వాత మళ్ళీ కెరీర్ లో వెనుదిరిగి చూడలేదు.
పారాలింపిక్స్ ప్రారంభానికి ఐదు నెలల ముందే డాక్టర్లు అవనికి గాల్‌బ్లాడర్ సర్జరీ జరిగింది. అయినా సరే త్వరగా కొలుకొని రెండోసారి ఆమె పారాలింపిక్స్‌లో స్వర్ణం గెలుచుకుంది.