Gunde Ninda Gudi Gantalu March 17th Episode Highlights: బాలుకి మళ్లీ అవమానం.. ఇక భరించలేక విశ్వరూపం చూపించిన మీనా - గుండె నిండా గుడి గంటలు మార్చి 17 ఎపిసోడ్ హైలెట్స్!
మౌనిక తాళి మార్చే ఫంక్షన్ ప్లాన్ చేస్తారు తల్లిదండ్రులు ప్రభావతి-సత్యం. ఇదే విషయం మౌనిక అత్తింటివారికి చెబుతారు. వాళ్లు బాలు ఇంట్లో ఉండకూడదనే కండిషన్ పెడతారు
Download ABP Live App and Watch All Latest Videos
View In Appమౌనిక ఫంక్షన్ కి అవసరం అయిన డబ్బులన్నీ బాలు సమకూరుస్తాడు. రాత్రి పగలు డ్రైవింగ్ చేసి తీసుకొచ్చి ఇస్తాడు. మీనా కూడా పూలుఅమ్మి సంపాదించిన డబ్బులు ఇచ్చేస్తుంది. రెస్ట్ లేకుండా బాలు తిరుగుతున్నాడని బాధపడుతుంది.
బాలు ఇంట్లో ఉండకూడదని మౌనిక అత్తింటివారు పెట్టిన కండిషన్ గురించి బాలుతో చెప్పమని ప్రభావతి అంటుంది. మొత్తం బాధ్యత మోస్తున్నవాడికి ఆ మాట ఎలా చెప్పాలని బాధపడతాడు తండ్రి సత్యం..
మార్చి 17 ఎపిసోడ్ లో ఫంక్షన్ హడావుడి ఓ వైపు జరుగుతుంటే..కాకినాడ వెళ్లి గుడిలో పూజ చేసుకుని రమ్మంటుంది ప్రభావతి. నేను ఇక్కడే ఉంటాను వెళ్లను అంటాడు బాలు
అత్తింట్లో జరుగుతున్న అవమానాలు పుట్టింట్లో చెప్పలేక, మానలేక తనలో తానే కుమిలిపోతుంటుంది మౌనిక. కన్నవారి ముందు భర్త, మావయ్య ఆడుతున్న నాటకాన్ని బయటపెట్టలేకపోతుంది
నువ్వు ఇంట్లో ఉండకూడదు అనే కండిషన్ మౌనిక అత్తింటివారు పెట్టారనే విషయం అప్పుడు బయటపడతుంది. ఆ విషయం మీ నాన్నకి కూడా తెలుసు అని ఇరికించేస్తుంది.
బాధపడిన బాలు..మీరు ఆ మాట చెప్పి ఉంటే మౌనిక వేడుక జరుగుతున్నంతసేపూ ఏ చెట్టుకిందో కూర్చునేవాడిని కదా అని బాధపడతాడు బాలు..
అప్పటివరకూ అన్నీ భరించిన మీనా.. భర్తకు మరింత అవమానం జరుగుతుంటే తట్టులేకపోతుంది. మౌనిక ఫంక్షన్ కోసం ఇంత కష్టపడి సంపాదించిన మీ కొడుకు మీకు అవసరం లేదని ఫైర్ అవుతుంది..