Brahmamudi Serial,Brahmamudi Today మే 23 ఎపిసోడ్: భార్యకు ప్రపోజ్ చేస్తున్న పిచ్చి మా 'రాజ్'.. యామిని ఇక సర్దేసుకోమ్మా - బ్రహ్మముడి సీరియల్ మే 23 ఎపిసోడ్ హైలెట్స్!
జనాభా లెక్కల పేరుతో కావ్యను ఇరికించాలని యామిని-రుద్రాణి ప్లాన్ చేస్తారు. ఆఫీసర్ ముందు రుద్రాణి కావాలనే కళావతి రిలేషన్ గురించి మాట్లాడుతుంది
Download ABP Live App and Watch All Latest Videos
View In Appఇంట్లో వాళ్లంతా ఏం చెప్పాలో ఆలోచిస్తుంటే..ఆమె అపర్ణకి మేనకోడలు అని రాజ్ చెప్తాడు. నిజమే చెప్పావ్ మనవడా అని అందరూ వంతపాడుతారు
రుద్రాణిని లోపలకు తీసుకెళ్లి చెంపలు వాయిస్తుంది ఇందిరాదేవి. అక్కడి నుంచి బయటకు వచ్చిన రుద్రాణిపై సెటైర్స్ వేస్తుంది స్వప్న. దీని బుద్ధి మారితే చూడాలని ఉంది అనుకుంటుంది
వంటగదిలో వంట చేస్తున్న కావ్యకు సైట్ కొడతాడు రాజ్. ఇద్దరూ సెటైరిక్ గా మాట్లాడుకుంటారు. సారీ చెప్పాను కదా యాక్సెప్ట్ చేయలేదా అంటాడు. సారీని యాక్సెప్ట్ చేసనందుకు కాఫీ ఇవ్వండి అంటాడు
కాఫీ ఇవ్వను అని తేల్చి చెప్పేసి కావ్య వెళ్లిపోతుంది..అప్పుడే అక్కడకు వచ్చిన అపర్ణ, ఇందిరాదేవి..కాఫీ కోసం ఇంతలా అడుక్కోవాలా అంటారు. ఇంకెందుకు ఆలస్యం వెంటనే ప్రపోజ్ చేయి అంటారు. శుక్రవారం ఉదయం మంచి ఘడియలు ఉన్నాయని ప్రపోజ్ చేసేందుకు ముహూర్తం కూడా ఫిక్స్ చేస్తారు
నా కొడుకును ఇలా చూస్తుంటే ముచ్చటగా ఉంది..వాడికి గతం గుర్తుకురాకపోయినా పర్వాలేదు జీవితాంతం కావ్యని ప్రేమిస్తూ భార్య బిడ్డలతో సంతోషంగా ఉంటే చాలు అనుకుంటుంది
రాజ్..కావ్యకు ప్రపోజ్ చేయబోతున్నాడని రాహుల్ వెళ్లి రుద్రాణికి చెబుతాడు. అదే జరిగిదే వాడు మనింటికి వచ్చేసినట్టే అని ఫిక్సవుతాడు. యామినికి కాల్ చేసి అదే విషయం చెప్తుంది రుద్రాణి
ప్రపోజ్ చేయగానే కావ్య ఒప్పుకుంటే నీకు రామ్ పూర్తిగా దూరమైపోతాడు..ఏం చేస్తావో తెలియదు రేపు వాడు ఇక్కడికి రాకుండా ఆపాలి అంటుంది. యామిని టెన్షన్ పడుతుంది
ఛార్లెస్ అనే దొంగను పట్టుకున్న అప్పుని పై అధికారులు మెచ్చుకుంటారు. వాడు ఇప్పటివరకూ 49సార్లు తప్పించుకున్నాడు మరోసారి తప్పించుకుంటే నీ ఉద్యోగం ఊడిపోతుందని హెచ్చరిస్తారు.
కావ్య దగ్గరకు వెళ్లి అపర్ణ, ఇందిరాదేవి..రేపు రాజ్ నీకు ప్రపోజ్ చేస్తాడు నువ్వు ఒప్పుకో అంటారు. యామిని పెళ్లి ఏర్పాట్లు చేసుకుంటోంది తొందరపడాలి అంటారు.
బ్రహ్మముడి మే 24 ఎపిసోడ్ లో ... మాతో ఏదైనా చెప్పాలా అని యామిని తల్లి వైదేహి అడుగుతుంది. రేపు నాకు క్లారిటీ వస్తుంది అప్పుడు చెప్తాను అంటాడు రాజ్...