Brahmamudi Serial Today December 12 Highlights :మనసులో ప్రేమ బయటకు బెట్టు.. కావ్యకు సపోర్ట్ చేసిన రాజ్ - బ్రహ్మముడి డిసెంబరు 12 ఎపిసోడ్ హైలెట్స్!
ఆస్తి గురించి ఇంత రచ్చ జరుగుతుంటే మీరు పట్టించుకోవడం లేదేంటని రాజ్ ని నిలదీస్తుంది కావ్య. ఇంట్లో అంతా నన్ను ప్రేక్షకుడిని చేసేశారు. పరిస్థితి నా చేయి దాటిపోయిందంటాడు.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appధాన్యలక్ష్మిని పొగుడుతుంటుంది రుద్రాణి. ఎంట్రీ ఇచ్చిన ప్రకాశం.. రుద్రాణిపై ఫైర్ అవుతాడు. నీ జీవితంలో ఏ కోల్పోయావో అర్థమయ్యాక..ఎంత డబ్బు ఇచ్చినా ఈ ఇంటివాళ్లు మీవంక చూడరంటాడు. రుద్రాణి మాటలు నమ్మి తప్పుడు దారిలో వెళుతున్న నిన్ను ఏదో రోజు నిన్ను నిలువునా ముంచేస్తుందని ధాన్యలక్ష్మిని హెచ్చరిస్తాడు ప్రకాశం.
రాజ్ ఆఫీస్కు వెళ్తుంటే ఆపుతుంది ధాన్యలక్ష్మి...కాసేపట్లో లాయర్ వస్తాడంటుంది. వస్తే ఏం జరుగుతుంది. ఆస్తులే కాదు బంధాలు, అనుబంధాలు ముక్కలు చేసేస్తాడు. సామ్రాజ్యాన్ని కూల్చేసి శకలాల కింద కప్పిన ముక్కలు ఏరుకునేందుకు సిద్ధంగా లేను అంటాడు రాజ్.
ఇందులో నీకూ వాటా వస్తుంది రాజ్ అంటూ ఎంట్రీ ఇస్తుంది రుద్రాణి. మహావృక్షాన్ని కూకటివేళ్లతో కూల్చేసి రెమ్మలు, కొమ్మలు పంచుకునేందుకు సిద్ధంగా ఉన్నారు..కానీ వృక్షం బూగర్భంలో ఉన్నంతసేపే పచ్చగా ఉంటుంది..కూల్చేస్తే మోడు మిగులుతుంది..అది మీకు అర్థంకావడంలేదంటాడు రాజ్..
ఇప్పటికైనా మించిపోలేదు ధాన్యం..ఆలోచించుకో. ఎవరికి వారు వాటాలు తీసుకుంటే ఎవరికి ఎవరూ కాకపోతారు. ఇన్నాళ్లూ రుద్రాణిని దాని కొడుకుని పెంచాడు అనుకున్నాం..కానీ ఇంట్లో చిచ్చు పెట్టేందుకు రెండు దరిద్రాలను పెంచాడని అంటాడు ప్రకాశం.
ఇంటి పెద్దవారసుడిగా మీరుండాలి అంటూ కావ్య అడుగుతుంది. ఇంట్లో అందరూ కూడా రాజ్ ని బలవంతంగా ఉంచుతారు. ఇంతలో లాయర్ వస్తాడు. ఆస్తి ముక్కలు చేసి అందరకీ పంచేయండి అంటాడు సుభాష్.ఆ హక్కు మీకు లేదు ...ఇంట్లో ఎవరకీ లేదంటాడు లాయర్. వారం క్రితమే వీలునామా రాశారంటూ ఆస్తి మొత్తం కావ్య పేరుమీద పెట్టినట్టు వీలునామా చదివి వినిపిస్తాడు లాయర్.
ఆస్తి మొత్తం బయటనుంచి వచ్చినవారిపేరుమీద రాయడం ఏంటని ధాన్యలక్ష్మి ఫైర్ అవుతుంది. అదీ నా బావ అంటే..ఆయన దూరాలోచన చూస్తుంటే గర్వంగా ఉంది శభాష్ బావా అంటుంది సీతారామయ్య భార్య ఇందిరాదేవి. ఏంటి మా నాట్లో మట్టికొడతారా అంటుంది ధాన్యలక్ష్మి. పెద్ద సంక్షోభం నుంచి కాపాడారు లాయర్ గారు థ్యాంక్స్ అంటాడు సుభాష్. నా డ్యూటీ నేను చేశానంటూ వీలునామా ఇచ్చానని వెళ్లిపోతాడు లాయర్.
ఆ వీలునామాపై ధాన్యలక్ష్మి, రుద్రాణి ఫైర్ అవుతారు. స్వప్న పంచ్ లు వేస్తుంటుంది. నువ్వు ఎలా వచ్చావో కావ్య కూడా అలానే వచ్చిందంటుంది అపర్ణ. మావయ్య..నీ భర్తను, నీ కొడుకును కాదని కావ్య పేరుమీద రాయడం ఏంటి అంటుంది. ఎవరు ఏం మాట్లాడినా ఆయన నిర్ణయాన్ని నేను ఒప్పుకుంటున్నాను...ఇందులో ఎవరూ మాట్లాడేందుకు లేదని తేల్చేస్తుంది ఇందిరాదేవి
న్యాయంగా తాత ఆస్తి మనవలకి చెందుతుంది కానీ మనవరాళ్లకి కాదు..నేను కోర్టుకెక్కుతా అంటుంది ధాన్యం. ఈ కావ్య మోచేతి నీళ్లు తాగి బతకాలా అని రుద్రాణి అంటే.. ఇన్నాళ్లు అదే కదా చేశారంటుంది స్వప్న. ముసలోడు మనకు అన్యాయం చేశాడని కొడుకుతో అంటుంది రుద్రాణి.
నేను సౌభాగ్యం అడిగితే ఐశ్వర్యం మొత్తం నా చేతుల్లో పెడతావా కృష్ణా అని అంటుంది కావ్య.
బ్రహ్మముడి డిసెంబర్ 13 ఎపిసోడ్ లో...ఇంది బాధ్యత చూసుకునే అర్హత నాకన్నా మీకే ఉందని రాజ్ తో అంటే.. బాధ్యతలు చూసుకునేందుకు నువ్వే కరెక్ట్ అంటాడు రాజ్. తాతయ్య నమ్మకాన్ని నిలబెడతావ్ అనుకుంటున్నా అంటుంది. కావ్య ఆశ్చర్యంలో సంతోషిస్తుంది.