Dhandoraa Movie: తెలంగాణ బ్యాక్‌డ్రాప్‌లో 'దండోరా'... నవదీప్, శివాజీతో 'కలర్ ఫోటో' నిర్మాత సినిమా
Actor Shivaji New Movie: ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా జాతీయ పురస్కారం అందుకున్న 'కలర్ ఫోటో'తో పాటు కార్తికేయ గుమ్మకొండ బ్లాక్ బస్టర్ మూవీ 'బెదురులంక 2012' ప్రొడ్యూస్ చేసింది లౌక్య ఎంటర్టైన్మెంట్స్ అధినేత రవీంద్ర బెనర్జీ (బన్నీ) ముప్పానేని. ఆయన ప్రొడ్యూస్ చేస్తున్న సినిమా 'దండోరా'. మురళీకాంత్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా బుధవారం ఫిల్మ్ నగర్‌లోని రామానాయుడు స్టూడియోలో పూజతో ప్రారంభమైంది.
Download ABP Live App and Watch All Latest Videos
View In App'దండోరా' ముహూర్తపు సన్నివేశానికి ప్రముఖ నిర్మాత సాహు గారపాటి క్లాప్ ఇవ్వగా... కల్ట్ ఫిల్మ్ 'బేబీ' నిర్మాత ఎస్.కె.ఎన్ కెమెరా స్విచ్ఛాన్ చేశారు. విజయయవంతమైన సినిమాలు నిర్మిస్తున్న యంగ్ ప్రొడ్యూసర్ సూర్యదేవర నాగవంశీ గౌరవ దర్శకత్వం వహించారు.
తెలంగాణ గ్రామీణ నేపథ్యంలో 'దండోరా' తెరకెక్కిస్తున్నారు. పురాతన ఆచారాలు, సాంప్రదాయాలను ఆవిష్కరిస్తూ... చక్కటి హాస్యంతో పాటు ప్రతి ఒక్కరి మనసుకు హృదయాన్ని హత్తుకునే భావోద్వేగాల, వ్యంగ్యం కలబోతతో సినిమా తెరకెక్కుతోందని దర్శక నిర్మాతలు తెలిపారు.
'దండోరా' విలక్షణ నటుడు శివాజీతో పాటు యువ హీరో నవదీప్, హీరో కమ్ కమెడియన్ రాహుల్ రామకృష్ణ, 'విరూపాక్ష' ఫేమ్ రవికృష్ణ, మనీకా చిక్కాల, అనూష తదితరులు నటిస్తున్నారు.
'దండోరా' చిత్రానికి ప్రముఖ సంగీత దర్శకుడు మార్క్ కె.రాబిన్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: వెంకట్ ఆర్. శాఖమూరి, కూర్పు: గ్యారీ బిహెచ్, కళా దర్శకుడు: క్రాంతి ప్రియమ్, కాస్ట్యూమ్ డిజైనర్: రేఖ భోగవరపు, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: ఎడ్వర్డ్ స్టీవ్‌సన్ పెరెజీ, సహ నిర్మాత: అనీష్ మరిశెట్టి.
శివాజీ, నవదీప్, రవికృష్ణ మీద క్లాప్ ఇస్తున్న సాహు గారపాటి.