Brahmamudi Serial Today December 05 Highlights : 'బ్రహ్మముడి' లో కీలక మలుపు .. హాస్పిటల్ బెడ్ పై సీతారామయ్యకు మాటిచ్చిన కావ్య - బ్రహ్మముడి డిసెంబరు 05 ఎపిసోడ్ హైలెట్స్!
కళ్యాణ్ ఉన్నతంగా ఎదగాలని అప్పు కోరుకుంటుంది..అదే టైమ్ కి ఎంట్రీ ఇచ్చిన అనామిక..కళ్యాణ్ బాండ్ రాశాడని, రచయిత దగ్గర ఊడిగం చేస్తున్నాడని బయటపెట్టేసి నోటికి పనిచెప్పి వెళ్లిపోతుంది. ఇంకెప్పుడూ అబద్ధం చెప్పొద్దంటుంది అప్పు. ఇద్దరూ ఒకర్నొకరు అర్థం చేసుకుంటారు
Download ABP Live App and Watch All Latest Videos
View In Appఎవ్వరూ లేని టైమ్ చూసి ధాన్యలక్ష్మిని రెచ్చగొడుతుంది రుద్రాణి. కావ్యను తీసుకొచ్చేస్తారు..పగ్గాలు రాజ్-కావ్య చూసుకుంటారు. ఇక నువ్వు ఏం చేయలేవు చిచ్చిపో అంటుంది. షాక్ అయిన ధాన్యలక్ష్మితో అంటే అలా యాక్ట్ చేయి అప్పటికి కానీ ఆస్తి ముక్కలు చేయరని క్లారిటీ ఇస్తుంది
కావ్యను ఒప్పించి ఇంటికి తీసుకొస్తారు అపర్ణ, సీతారామయ్య, ఇందిరాదేవి.. ఇంట్లో కావ్య అడుగుపెట్టేసరికి ధాన్యలక్ష్మి ఉరేసుకునేందుకు సిద్ధమవుతుంది..అది చూసి ఇంట్లో అంతా అడ్డుకుంటారు.అపర్ణ లాగిపెట్టి కొట్టి క్లాస్ వేస్తుంది
మరింత రెచ్చగొట్టేందుకు చూసిన రుద్రాణికి ఇచ్చిపడేస్తారంతా. కేవలం నీ తండ్రి నమ్మకంగా పనిచేశారు ఆయనకు ఇచ్చిన మాట మేరకు నువ్వు ఇంట్లో ఉన్నావ్ లేదంటే ఎప్పుడో గెంటేసేవారం అంటుంది అపర్ణ.
‘నా కొడుక్కి ఆస్తిలో భాగం ఇవ్వాల్సిందే లేదంటే చస్తా అన్న ధాన్యంతో..చావాలి అనుకుంటే అందరూ వచ్చేవరకూ ఎందుకు ఆగావ్ అంటాడు భర్త ప్రకాశ్. అసలు నీ కొడుకు జీవితం నువ్వే నాశనం చేశావ్..కోడలిగా అప్పుని ఒప్పుకుని ఉంటే వాడుకూడా ఇక్కడే సంతోషంగా ఉండేవాడుగా అంటుంది ఇందిరాదేవి
ఈ రచ్చ మొత్తం చూసి సీతారామయ్య గుండెనొప్పితో పడిపోతాడు..ఇంట్లో అంతా కంగారుపడిపోతారు. ఆసుపత్రిలో జాయిన్ చేస్తారు
ఇప్పటికి నీ మనసు కుదుటపడిందా, అహంకారం తగ్గిందా..ఈ విషపురుగు చెప్పుడుమాటలు విని ఇలా ప్రవర్తించావ్.. చెట్టంతమనిషి కుప్పకూలిపోయేలా గొడవ చేసి ఏం సాధించావ్ అని దులిపేస్తుంది ఇందిరాదేవి. అడ్డుపడిన రుద్రాణిని కడిగేస్తుంది..
బ్రహ్మముడి డిసెంబర్ 06 ఎపిసోడ్ లో సీతారామయ్య కావ్యను పిలిచి మాట్లాడుతాడు. ‘ఇక నుంచి ప్రతి రోజు నీకో పరీక్షలా ఉంటుంది, రాజ్ మరింత దురుసుగా ప్రవర్తించవచ్చు, నీ ఓర్పుతో అన్నీ చక్కదిద్దు...ఇల్లు వదిలి వెళ్లిపోను అని మాటివ్వమ్మా అంటాడు సీతారామయ్య.