Brahmamudi Serial Today December 02 Highlights : తండ్రికి ప్రామిస్ చేసిన తిక్క రాజ్ ..అత్తారింట్లోకి కావ్య రీ ఎంట్రీ - బ్రహ్మముడి డిసెంబరు 02 ఎపిసోడ్ హైలెట్స్!
కుటుంబాన్ని వదిలేసి కావ్య ఇంటికి చేరిన అపర్ణ..కొడుకులో మార్పు వచ్చి తనతో పాటూ కోడలిని కూడా తీసుకెళ్తాడని ఆశిస్తుంది. అందుకు తగ్గట్టే ప్లాన్ చేస్తుంది..కానీ రాజ్ లో ఎలాంటి మార్పు రాదు..
Download ABP Live App and Watch All Latest Videos
View In Appకొడుకులో మార్పు రాదని ఫిక్సైన అపర్ణ.. డిసెంబరు 02 సోమవారం ఎపిసోడ్ లో ఏకంగా భర్త సుభాష్ కి విడాకుల నోటీస్ పంపిస్తుంది. అది చూసి రాజ్ షాక్ అవుతాడు. సుభాష్ ఆవేదన చెందుతాడు
ఈ వయసులో నేను భార్యను దూరం చేసుకోవడం అవసరమా..నాకు నా భార్య కావాలి అని గట్టిగా మాట్లాడుతాడు. అసలు అత్తయ్యగారు విడాకుల నోటీస్ పంపింపడం ఏంటని కావ్య క్వశ్చన్ చేస్తుంది..ఈ మొత్తం వ్యవహారానికి కారణం నువ్వే అని రాజ్ ఎప్పటిలా కావ్యపై ఫైర్ అవుతాడు
ఈ రచ్చ అంతా జరుగుతుండగానే రాజ్ రియాక్టవుతాడు..తల్లిని తీసుకొచ్చి తీరుతానని తండ్రి సుభాష్ కి మాటిచ్చాడు. అంటే అపర్ణ రావాలంటే కావ్యని తీసుకురావాల్సిందే. ఈ లెక్కన కావ్య దుగ్గిరాలవారింటి కోడలిగా రీఎంట్రీ ఇవ్వబోతోందన్నమాట.
ఆత్మాభిమానం ఉన్న కావ్య మాత్రం తనను భార్యగా అంగీకరించినప్పుడే ఆ ఇంటికి వస్తానని పట్టుబట్టే అవకాశం ఉంది. అపర్ణ నాలుగు చీవాట్లు పెట్టి తనతో పాటూ కావ్యను తీసుకెళ్తుంది...మరి కావ్య రియాక్షన్ ఎలా ఉంటుందో..అత్తారింట్లో రాజ్ నుంచి ఎలాంటి అవమానాలు ఎదుర్కొంటుందో చూడాలి
మరోవైపు వంటమనిషి పేరుతో కొత్తమ్మాయిని తీసుకొచ్చారు. రాహుల్ కన్ను ఆమెపై పడింది.. ప్రకాశం కూడా ధాన్యలక్ష్మిని ఏడిపించేందుకు ఇదే మంచి సమయం అనే ఆలోచనతో కావాలనే స్టెల్లా జపం చేస్తున్నాడు..దుగ్గిరాలవారింట్లో కొత్త వంటమనిషి స్టెల్లా ఎలాంటి సునామీ క్రియేట్ చేస్తుందో చూడాలి
ఇప్పటివరకూ ఓ లెక్క ఇకపై మరోలెక్క..డిసెంబరు 02 బ్రహ్మముడి కథతో సీరియల్ కీలక మలుపు తిరగబోతోంది...