Brahmamudi Serial Today November 20th Highlights : 'మన్మథుడు' సీన్ రిపీట్ చేసిన రాజ్ ..ఇక కళావతిని తీసుకురాక తప్పదా - బ్రహ్మముడి నవంబరు 20 ఎపిసోడ్ హైలెట్స్!
రాజ్ ఆఫీసుకి స్టార్ అవుతాడు...తానే గెలుస్తానని నమ్మకంగా చెబుతాడు. ఇంట్లో అందరి దీవెనలు అడుగుతాడు.. పిల్లా పాపలతో చల్లగా వర్ధిల్లు అని అందరూ ఇన్ డైరెక్ట్ గా కావ్య గెలవాలని రాజ్ ని దీవిస్తారు.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appరుద్రాణి మాత్రం నా ఫుల్ సపోర్ట్ రాజ్ కే అంటూ... CEO గా రాజ్ ని చూడడం ఇష్టంలేనట్టు మాట్లాడుతారేంటి అంటుంది. మీకు అసలు కావ్య ఇంటికే రావడం ఇష్టంలేనట్టు మాట్లాడుతారేంటని స్వప్న పంచ్ వేస్తుంది
నా విజయంపై నేను ధీమాగా ఉన్నాను.. విజయంతో తిరిగొచ్చి నా టీమ్ కి ఇంట్లోనే గ్రాండ్ పార్టీ ఇస్తాను వంటలు అద్భుతంగా చేయాలని వంటమనిషికి చెబుతాడు రాజ్. వీడేదో ఫిటింగ్ పెట్టాడేమో బావా అని సీతారామయ్యతో అంటుంది ఇందిరాదేవి. అసలు విషయం తెలిస్తే అవాక్కవుతారు అనుకుంటాడు
మరోవైపు కావ్యను లేటుగా ఆఫీసుకి తీసుకెళ్లేందుకు రాజ్ చెప్పినట్టే చేస్తాడు ఆటో డ్రైవర్. స్పీడ్ గా వెళ్లమని కావ్య కోప్పడినా కానీ ఆటో డ్రైవర్ మాత్రం రూట్ మార్చి తీసుకెళ్తాడు
కావ్య ఇంకా రాలేదేంటని కాంట్రాక్టర్స్ అంటే.. రాజ్ మాత్రం ఇదే అవకాశం అని కావ్యను టార్గెట్ చేస్తాడు. ఆడవాళ్లు అంతే అని తేలిగ్గా మాట్లాడుతాడు. శ్రుతి కావ్యకు కాల్ చేసి ఎక్కడున్నారని అడుగుతుంది. రోడ్డు రిపేర్ వర్క్ ఉందని రూట్ మారిందని చెబుతుంది కావ్య. మీరు త్వరగా రాకపోతే జగదీష్ గారి మైండ్ మార్చేసేపనిలో పడ్డారని శ్రుతి అంటుంది. ఇంతలో ఆటో ఓ బైక్‌ను ఢీకొట్టడంతో గొడవపడతారు ఇద్దరు.
ఆమె వచ్చేలోగా నా డిజైన్లు చూడండి అంటాడు రాజ్. మేడమ్ ఎప్పుడు లేట్‌గా రారు..ఏదో జరిగిందని శ్రుతి డౌట్ పడుతుంది.మరోవైపు గొడవ సాల్వ్ చేసి ఆటో తీయిస్తుంది కావ్య. ఇక వచ్చేస్తున్నట్టు రాజ్ కి మెసేజ్ చేస్తాడు డ్రైవర్.
ఈ లోగా నా డిజైన్లు చూడండి రాజ్ చూపిస్తాడు. కావ్య మేడం వేసిన డిజైన్లు సర్ దగ్గరకి ఎలా వచ్చాయ్ అనుకుంటుంది ..అప్పుడే ఎంట్రీ ఇచ్చిన కావ్య ఆ డిజైన్లు చూసి షాక్ అవుతుంది. మేడం ఇవి మీరు వేసిన డిజైన్లు కదా అని శ్రుతి అంటే.. క్లైంట్ ముందు ఏమీ మాట్లాడొద్దు అంటుంది కావ్య.
రాజ్ చూపించిన డిజైన్లు చూసి చప్పట్లు కొడతాడు జగదీష్ చంద్రప్రసాద్. రాజ్ టాలెంట్ నెక్ట్స్ లెవెల్ అంటాడు. అప్పుడు కావ్య కూడా పొగుడుతుంది. మీ డిజైన్లు చూపించండి అని కావ్యని అంటే.. సేమ్ దగ్గరగానే ఉన్నాయి అనేస్తుంది. ఇవే బావున్నాయి తీసుకోండి అంటుంది. కాంట్రాక్ట కి పేపర్స్ రెడీ చేయండి జగదీష్ చంద్రప్రసాద్ చెబుతాడు
మేడం ఇది సరికాదు..సర్ మీ డిజైన్లు దొంగతనం చేసి ఇలా బిల్డప్ ఇచ్చుకోవడం చూడలేకపోతున్నా అంటుంది శ్రుతి. చూడలేకపోతే జాబ్ మానేసి పో.. నా కష్టం, నా కష్టార్జితం నా భర్తకే చెందుతాయి అంటుంది.
బ్రహ్మముడి నవంబరు 21 ఎపిసోడ్ లో ... అపర్ణ హారతి తీసుకొస్తుంది.. కావ్య ఏదని అడిగితే పర్మినెంట్ గా పుట్టింట్లో ఉంటుంది నేను గెలిచాను అంటాడు రాజ్. ఛీ నీదీ ఓ గెలుపేనా కావ్య డిజైన్లు దొంగతనం చేసి గెలిచానని చెప్పుకునేందుకు సిగ్గులేదా అని తిడతాడు సీతారామయ్య. వెళ్లి కావ్యను తీసుకురా అని తిడతారు..