AP News: ఫ్యామిలీ మొత్తం ఊరెళ్తున్నారా ? తక్షణం ఈ పని చేస్తే మీ ఇల్లు సేఫ్
మీరు ఊరు వెళ్తున్నారా ? సాధారణంగా అయితే ఇంట్లో బంగారం పోతుందనో, నగదు చోరీ చేస్తారనో.. లేక డాక్యుమెంట్లు పోతాయనో భయం పట్టుకుంటుంది.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appమీరు ఊరు వెళ్తున్నారా ?? అయితే మీకు ఏ టెన్షన్ అవసరం లేదు అని ఎన్.టి.ఆర్ జిల్లా పోలీస్ చెబుతున్నారు. మీరు ఊరెళ్తున్నట్లు అయితే మీ ఇంటి భద్రత కొరకు వెంటనే LHMS యాప్ ను లింక్ ద్వారా గూగుల్ ప్లే స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోవాలి. దాంతో పోలీసు నిఘా కెమెరాల కొరకు ఆ యాప్ ద్వారా రిక్వెస్ట్ పంపాల్సి ఉంటుంది.
పోలీసులు మీ ఇంటి వద్దకు వచ్చి LHMS కెమెరాలను ఉచితంగా అమర్చుతారు. దాంతో ఎవరైనా అపరిచిత వ్యక్తులు మీ ఇంటిలోనికి ప్రవేశిస్తే కంట్రోల్ రూమ్ లోని అలారం మ్రోగుతుందని పోలీసులు తెలిపారు. వారు వెంటనే దగ్గరలోని పోలీసులకు సమాచారం అందిస్తారు. వెంటనే మీ ఇంట్లో ప్రవేశించిన వారిని అదుపులోకి తీసుకుని మీ వస్తువులు, నగదు, నగలుకు రక్షణ కల్పిస్తామని ఎన్టీఆర్ జిల్లా పోలీసులు చెబుతున్నారు.
ఊరు వెళ్తున్నవారు ఈ యాప్ https://play.google.com/store/apps/details?id=com.msm.lhmsappolice&hl=en_IN&pli=1 మీ మొబైల్ లో ఇన్ స్టాల్ చేసుకోవాలి. ఏమైనా అవసరం అయితే LHMS కాంటాక్ట్ నెంబర్ 9440906878లో సంప్రదించాలని పోలీసులు సూచించారు.
ఏపీ పోలీసులు ఈ విధంగా టెక్నాలజీ సాయంతో ఇళ్లలో చోరీలు జరగకుండా చర్యలు తీసుకుంటున్నారు. ఇలాంటి వాటిపై ప్రజలకు ఎప్పటికప్పుడూ అవగాహన కల్పిస్తున్నారు.