Brahmamudi Serial Today October 30th Episode: కావ్య తెలివికి రాజ్ ఫిదా .. అనామికను ఛీ కొట్టబోతున్న సామంత్ - బ్రహ్మముడి అక్టోబరు 30 ఎపిసోడ్ హైలెట్స్!
నష్టాల్లో ఉన్న అరవింద్ కంపెనీతో డీల్ కుదుర్చుకున్న కావ్య లాభాలు తెచ్చేలా చేస్తానని..అందులో 50% వాటా ఇవ్వాలంటుంది. సరే అంటాడు అరవింద్. అందులో భాగంగా వేలం పాటలో తన కంపెనీ కొనేందుకు అన్నీ రెడీ చేయమని రాజ్ కి చెబుతుంది. వాడి కంపెనీ కొనడం ఏంటని రాజ్ అన్నా కానీ..చెప్పింది చేయండి అంటుంది.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appస్వప్నకు కాల్ చేస్తుంది కావ్య. రుద్రాణి పొగరు అణిచే ఆఫర్ ఇప్పుడొచ్చిందంటుంది. ఓ కంపెనీ దివాలా తీసి వేలం పాటకు వచ్చిందంటూ ప్లాన్ చెబుతుంది కావ్య. మా అత్తను వాడుకుని అనామికను దెబ్బకొట్టి దీన్ని పిచ్చిదాన్ని చేయాలి అంతే కదా అంటుంది స్వప్న. జాగ్రత్తగా ఉండు నీపై డౌట్ రాకూడదు అంటుంది కావ్య..సరే అంటుంది స్వప్న
చెస్ ఆడుకుంటున్న రాహుల్-రుద్రాణి దగ్గరకు వెళ్లి.. అరవింద్ కంపెనీ గురించి గొప్పగా మాట్లాడుతుంది. దివాలా అంటున్నారు కానీ ఆ కంపెనీ కొంటే భారీ లాభాలు వస్తాయా అందుకే నువ్వు ఆ నిర్ణయం తీసుకున్నావా అని గట్టిగా మాట్లాడుతుంది. నీ ఐడియా సూపర్ గా ఉంది కావ్య..తాతయ్య నీపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నావ్ అంటుంది
మీరిద్దరూ ఇక్కడే ఉన్నారా గమనించనే లేదంటుంది స్వప్న. ఏంటి విషయం అని రుద్రాణి అంటే..ఎందుకు చెడగొట్టడానికా? మా కావ్య సక్సెస్ అయ్యేందుకు ఏదో చేస్తోందిలే అనేసి వెళ్లిపోతుంది.. వెంటనే అనామికకు కాల్ చేస్తుంది రుద్రాణి.. అరవింద్ కంపెనీ కావ్య కొంటోందని చెప్పగానే..నాకు అర్థమైంది నేను చూసుకుంటాను అని కాల్ కట్ చేస్తుంది అనామిక.
అందరూ భోజనం చేస్తుంటే కోపంగా వచ్చిన రాజ్..దివాలా కంపెనీ కొంటోందంటూ కళావతిపై కంప్లైంట్ ఇస్తాడు. సీతారామయ్య మాత్రం నా మనవరాలిపై నాకు నమ్మకం ఉందంటాడు
మిగిలిన అందరూ వంటలు చాలా రుచిగా ఉన్నాయంటూ మాట్లాడుకుంటారు. రాజ్ ఫైర్ అవడంతో..కోపంగా లేచిన సీతారామయ్యCEO కి సర్వ హక్కులు ఉంటాయి..అదేంటని ప్రశ్నించే అధికారం ఎవరికీ ఉండదంటాడు.. మనం రోడ్డున పడడం ఖాయం అంటుంది రుద్రాణి
కళ్యాణ్ నుంచి పాట తీసుకుని కాస్త హేళనగా మాట్లాడి 5 వేలు పంపిస్తాడు లక్ష్మీకాంత్ . మీరు డబ్బులిస్తున్నారా అని పక్కనున్న వ్యక్తి అంటే.. వాడు జనంలోకి వెళ్లకూడదు..నా గుప్పిట్లో ఉండాలి అంటాడు లక్ష్మీకాంత్ . తన తీరు బాలేదని అప్పు అంటుంది..
కావ్యకు కాల్ చేసిన సీతారామయ్య...రాజ్ మాటల గురించి చెప్పి నువ్వు జాగ్రత్తగా ఉండమ్మా అని చెబుతాడు. ఈ రోజు ఎపిసోడ్ ముగిసింది..
బ్రహ్మముడి అక్టోబరు 31 ఎపిసోడ్ లో...పోటీ పడి మరీ నష్టాల్లో ఉన్న కంపెనీని కొనేస్తుంది అనామిక. పైగా కావ్యను అవమానించేలా మాట్లాడుతుంది. అప్పుడే అక్కడకు వచ్చిన అరవింద్.. 5 కోట్లకు మించి పలకని నా కంపెనీని భారీ లాభానికి అమ్మారు అంటూ కావ్యకు థ్యాంక్స్ చెబుతాడు..సామంత్ షాక్ అవుతాడు ...