Brahmamudi Serial Today October 25th Highlights: ఆపరేషన్ ఈగో మొదలెట్టిన అపర్ణ అండ్ కో - బ్రహ్మముడి అక్టోబరు 25 ఎపిసోడ్ హైలెట్స్!
ఇంటికి వెళ్లిన కావ్యను ఆఫీసులో ఏం జరిగింది? అల్లుడుగారు ఏమైనా అన్నారా అని అడుగుతుంది కనకం. ఏం జరగకూడదో అదే జరిగిందంటుంది. నువ్వు తగ్గావా అంటే...ఆయన తొక్కాలని చూస్తున్నారని చెబుతుంది. నేనుండగా ఆఫీసులో అడుగుపట్టను అన్నారని చెబుతుంది
Download ABP Live App and Watch All Latest Videos
View In Appఇందిరాదేవికి కాల్ చేసి మాట్లాడుతుంది కనకం... నీకెందుకు కంగారు మేం రాజ్ ఆఫీసుకి వెళ్లేలా మేం చూసుకుంటాం అంటారు అపర్ణ, ఇందిరాదేవి. ఎలా ఒప్పిస్తున్నారో చెప్పండి ముందు అంటుంది. ఈ రోజు ఆపరేషన్ ఈగో మొదలుపెడుతున్నాం అంటారు.
అప్పుడే వచ్చిన రుద్రాణి..ఎవరి ఇగో రెచ్చగొట్టాలని అనుకుంటున్నారని అడుగుతుంది. వచ్చిందమ్మా విలక్షణ నిటి..పాము చెవులు పెట్టుకుని వింటుంది..ఇంకా ఎన్ని అవార్డులు కావాలని అడుగుతుంది ఇందిరాదేవి. నాటకం ఆడింది కనకం..నేను నిజాలే మాట్లాడాను అంటుంది రుద్రాణి.
ఏం ప్లాన్ చేశారో చెప్పండి అని రుద్రాణి అంటే ఏం చెడగొడదామనా అంటారు. నాకు తెలుసు నేను చెప్పనా అంటూ స్వప్న ఎంట్రీ ఇస్తుంది నాకు నష్టమేదైనా జరిగితే అది నీవల్లే అంటుంది. మిమ్మల్ని ఇంట్లోంచి పంపించేందుకు ప్లాన్ చేస్తున్నారని అంటుంది.మీ అబ్బాయిని కూడా అంటుంది. మరి నువ్వో అంటే.. నేను మీలా బేవర్స్ బ్యాచ్ కాదు..తాతయ్యగారు నాకు ఆస్తి రాసిచ్చారంటుంది
ఆటో డ్రైవర్ కి టాలెంట్ ఉండదా అని బాధపడతాడు. నీ దగ్గర టాలెంట్ లేకుండానే నువ్వు రాసిన సాంగ్ తీసుకున్నారా అని మోటివేట్ చేస్తుంది.
ఆఫీసులో ఏం జరుగుతుందో తెలుసుకునేందుకు ల్యాప్ టాప్ ఓపెన్ చేసిన రాజ్.. పాస్ వర్డ్ మార్చేసిందని తెలుసుకుని కాల్ చేస్తాడు. నేను కనుక్కున్నట్టే మీరూ కనుక్కోండి అనేస్తుంది. కంపెనీ నుంచి బయటకు వెళ్లినవారికి పాస్ వర్డ్ చెప్పాల్సిన అవసరం లేదంటుంది.
ఆ కోడి బ్రెయిన్దే కనుక్కున్నప్పుడు నేను తెలుసుకోలేనా అని ట్రై చేస్తాడు కానీ వర్కౌట్ కాదు. మొగుడి పోస్ట్, ఎండీ పోస్ట్, యువరాజ్ పోస్ట్ మొత్తం పోయాయని అంతరాత్మ అంటుంది.
కళ్యాణ్ కి కాల్ చేసిన లక్ష్మీకాంత్..ఇందాక నేను అన్న మాటలకు కోపం వచ్చిందా? చిన్నవాటికే కోపం తెచ్చుకుంటే రేపు నువ్వు రైటర్ అయ్యాక నిర్మాత, డైరెక్టర్, మ్యూజిక్ డైరెక్టర్ ఒక్కోలా మాట్లాడుతారు..అవమానాలు మన జీన్స్ లో కలసిపోవాలి. నిన్ను అసిస్టెంట్ గా తీసుకునేందుకు కొన్ని టెస్టులు పెడతాను అంటాడు.. సరే అంటాడు కళ్యాణ్
మర్నాడు ఉదయం అందరూ ఇంట్లో ఉంటే... తనని బతిమలాడేందుకు సిద్ధంగా ఉన్నారు అనుకుంటాడు. కానీ ఎవ్వరూ పట్టించుకోరు.
కావ్యకు కాల్ చేసిన అనామిక..నేను నీ కంపెనీ క్లైంట్స్ ని లాక్కున్నా అంటుంది. పునాదులు లేకుండా నీ ఆఫీసుని కూల్చేస్తా అంటుంది. ఎపిసోడ్ ముగిసింది