Brahmamudi January 9th Episode: ఏడుస్తుంటే ముద్దొస్తున్నావ్ అన్న రాజ్ .. కొండంత బాధలోనూ మురిసిన కళావతి - బ్రహ్మముడి జనవరి 9 ఎపిసోడ్ హైలెట్స్!
ప్రకాశ్ తనకు జరిగిన అవమానాన్ని తలుచుకుని కుమిలిపోతాడు..అన్నయ్య సుభాష్ తో చెప్పుకుని బాధపడతాడు. గతంలో ఎప్పుడూ ఇలాంటి సమస్యలు రాలేదని చెబుతాడు. కావ్య ఎందుకలా చేస్తోందో నేను అడిగి తెలుసుకుంటాను అంటాడు సుభాష్
Download ABP Live App and Watch All Latest Videos
View In Appనిజంగానే మేం గోల్డ్ మీద చాలా పెట్టుబడి పెట్టాం..ఆఫీసులో చాలా గోల్డ్ స్టాక్ ఉంది మావయ్య..నన్ను అర్థం చేసుకోండి. నేను మీ అమ్మాయి లాంటిదాన్ని నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నారు అంటుంది. పెద్దా చిన్నా అనే ఆలోచన లేకుండా నలుగురిలో నన్ను అవమానించి ఇప్పుడు సారీ అడుగుతున్నావా అంటాడు.
వారం తర్వాత మళ్లీ పిలిపించి గోల్డ్ కొనుక్కుందాం అంటుంది. ఒక్కసారి నమ్మకం కోల్పోతే మళ్లీ తెచ్చుకోలేం అంటాడు. నేను మాటిస్తే రాజ్ కావ్య కాదనరు అని గట్టిగా చెప్పి తీసుకొచ్చాను..ఒక్క క్షణంలో గాలిమాటలా తీసిపారేశావ్..ఇంకా ఏ మొహం పెట్టుకుని ఇంట్లో తిరగమంటావ్ అంటాడు. క్షమించమని కావ్య బతిమలాడినా ప్రకాశం ఇక వెళ్లిపో అంటాడు. ధాన్యలక్ష్మి ఎప్పటిలా కావ్యపై విరుచుకుపడుతుంది
ఎందుకు అత్తయ్యా ఒకప్పుడు అందర్నీ కాదని నాకు సపోర్ట్ చేశారు..కానీ నన్ను ఎందుకు శత్రువులా చూస్తున్నారని బాధపడుతుంది. మారింది నేను కాదు నువ్వు అని ధాన్యలక్ష్మి క్లాస్ వేస్తుంది. ఆస్తి చేతికి రాగానే నీ నిజస్వరూపం బయటపెడుతున్నావ్..నాకు నా భర్తకి విలువ లేకుండా చేసిన నిన్ను శత్రువులా కాకుండా ఎలా చూడాలి అంటుంది
పైనుంచి అంతా గమనిస్తాడు రాజ్..పైకి ఏడుస్తూ వచ్చిన కావ్యను ఓదార్చుతాడు. ఇంట్లో వాళ్లకి నిజం చెప్పేద్దాం అంటాడు కానీ కావ్య మాత్రం వద్దంటుంది.
రుద్రాణి-రాహుల్ మాత్రం ఇదేకదా తమకు కావాల్సింది అని సంతోషంగా ఉంటారు. దేవుడు ధాన్యలక్ష్మి పుట్టింటివాళ్ల రూపంలో వచ్చి మనకు సహాయం చేశాడు అనుకుంటారు. ఇలాంటి టైమ్ లో నీ పెళ్లానికి సీమంతం చేయాలి అంటుంది రుద్రాణి.
టిఫిన్ ఎవరికి ఏం కావాలో అడిగి చేయమన్నారు కావ్యమ్మగారు అంటుంది శాంత. మాపై దయతో శాసనాలు తిరగరాస్తోందా అని సెటైర్ వేస్తుంది రుద్రాణి. కొన్ని కారణాలవల్ల ఈ కండిషన్స్ పెట్టాల్సి వచ్చింది..మా ఆయన చెప్పడం వల్ల రూల్స్ బ్రేక్ చేశాను అంటుంది కావ్య .
ముష్టివాళ్లకు పడేసినట్టు నాలుగు రకాల టిఫిన్లు, నాలుగు కూరలు పడేస్తే నువ్వు చేసిన అవమానాలు మర్చిపోతాను అనుకున్నావా అంటుంది ధాన్యలక్ష్మి. ఇంతలో పంతులు ఎంట్రీ ఇస్తాడు..ఎవరు పిలిచారని ఇందిరాదేవి అంటే నేనే పిలిచాను స్వప్నకు సీమంతం చేయాలని అంటుంది రుద్రాణి
అయినా ఇంతమంచి ఆలోచన నీకెలా వచ్చింది అత్తా అని సెటైర్ వేస్తుంది స్వప్న. ప్రకాశం కూడా సెటైర్స్ వేస్తాడు. ఇంట్లో టీ, కాఫీలకే దిక్కు లేదు ఇక సీమంతం సాధ్యమా అంటుంది స్వప్న. నువ్వే వర్రీ అవకు సీమంతం గ్రాండ్ గా జరిపిస్తా అంటుంది రుద్రాణి
బ్రహ్మముడి జనవరి 10 ఎపిసోడ్ లో... సీమంతానికి అన్నీ సిద్ధం చేసేశానంటూ పెద్ద లిస్ట్ తీసుకొచ్చి ఇస్తుంది రుద్రాణి. బడ్జెట్ 20 లక్షలు అని చెప్పగానే రాజ్ కావ్య షాక్ అవుతారు...