Brahmamudi January 7th Episode: ఆడా ఉంటా ఈడా ఉంటా అంటూ చెలరేగిపోతున్న కావ్య.. అనామిక ప్లాన్ ఫెయిల్ - బ్రహ్మముడి జనవరి 7 ఎపిసోడ్ హైలెట్స్!
నిద్రపోతున్న రాజ్ ని లేపేందుకు ప్రయత్నిస్తూ చక్కిలిగిలి పెడుతుంది కావ్య. పైకి లాక్కుని ముద్దుపెట్టబోతాడు రాడ్. ఓ కండిషన్ అంటూ... ఇంకెప్పుడూ నా చేయి వదలను అని మాటిస్తే ఓకే అంటుంది. అమ్మో పీపీటీ ప్రిపేర్ చేయాలంటూ లేచి వెళ్లిపోతాడు రాజ్
Download ABP Live App and Watch All Latest Videos
View In Appరాజ్, కావ్య ఆఫీస్కు వెళుతుంటే... డ్రైవింగ్ జోరు తగ్గించమని లేట్ కళావతి, లేట్ రాజ్ అవకూడదంటూ క్లాస్ వేస్తుంది. ఆ తర్వాత మీరు ఫైల్ మర్చిపోయారని గుర్తుచేస్తుంది. నువ్వు వెళ్లి తీసుకురా అంటాడు రాజ్
రాజ్ ఒక్కడే ఆఫీస్కు రావడం చూసి సెక్యూరిటీ ఆ విషయం అనామికకు కాల్ చేసి చెబుతాడు. తనతోం ఏ పనిలే మనం ఆల్రెడీ కిరీటం మార్చేశాం కదా అనుకుంటారు.
కావ్య , రాజ్ కన్నీళ్లు పెట్టుకుంటే నా ఈగో సాటిస్ ఫై అవుతుంది అనుకుంటుంది అనామిక. కావ్యకు ఫోన్ చేసి సంతోషంగా పాటలు పాడుతుంటే కావ్య కాల్ చేయబోతుంది. మీ ఆయన అక్షింతలు వేయించుకుంటుంటే నువ్వు ఇంకా బయటే ఉన్నావా అంటుంది.
కాసేపట్లో నేను గెలవబోతున్నా అని అనామికతో ఛాలెంజ్ చేస్తుంది కావ్య. ఇంకాసేపట్లో ఆఫీస్లో ఊహించని విధంగా నష్టం జరగబోతోంది..మీ కుటుంబం రోడ్డుమీదకు రాబోతోంది అంటుంది. ఫోన్ కట్ చేసి అనామిక, సామంత్ సంబరాలు చేసుకుంటారు.
అనామిక ఎలాంటి కుట్రచేసిందో అని కావ్య కంగారుపడుతుంది. రాజ్ కి కాల్ చేస్తుంది కానీ లిఫ్ట్ చేయడు. జగదీశ్ ప్రసాద్ తో వచ్చిన అప్రైజల్ ఆ నగలు చెక్ చేసి..ఇది నకిలీ కిరీటం అని చెబుతాడు. ఇలా మోసం చేస్తారా అని ఫైర్ అవుతాడు జగదీష్ ప్రసాద్. ఏదో పొరపాటు జరిగిందని రాజ్ చెప్పబోతున్నా పట్టించుకోడు. ఇంతలో కావ్య ఎంట్రీ ఇస్తుంది.
నీకు తెలియకుండా ఇంత పెద్ద ఫ్రాడ్ జరిగిందని అనుకోవడం లేదని కావ్యను అంటాడు జగదీశ్ ప్రసాద్. ఇది మోడల్ డిజైన్ మాత్రమే ఒరిజనల్ తన దగ్గరే ఉందని చెబుతుంది. కావ్యతో పాటూ లాకర్ రూమ్ కి వెళ్లిన రాజ్ కిరీటం తీసుకొచ్చి ఇస్తుంది. సారీ చెబుతాడు జగదీశ్...
తాను కొట్టేసింది బంగారు కిరీటం కాదని తెలిసి సెక్యూరిటీ వణికిపోతుంటాడు..మరోవైపు అనామిక సంతోషంలో ఉంటుంది. ఇంతలో సెక్యూరిటీ కాల్ చేసి జరిగిన విషయం చెబుతాడు.. అనామిక, సామంత్ షాక్ అవుతారు.
మార్వాడీతో బంగారం డీల్ కుదర్చుకుంటాడు ప్రకాశం.. ఆ డీల్ వద్దంటుంది కావ్య. మా ఇంట్లో నేను ఎంత చెబితే అంత అన్నావ్ కదా అని ప్రకాశాన్ని అవమానిస్తాడు మార్వాడి. కంపెనీ నిర్ణయాలు నేనే తీసుకుంటాను..సంబంధం లేనివాళ్లు జోక్యం చేసుకోవద్దు అంటంది కావ్య. అంతా షాక్ అవుతారు..