Brahmamudi January 14th Episode: అడ్డంగా దొరికిపోయిన రాజ్ కావ్య .. ఇక నిజం చెప్పాల్సిందే - బ్రహ్మముడి జనవరి 14 ఎపిసోడ్ హైలెట్స్!

స్వప్న సీమంతానికి ఏర్పాట్లు చేస్తోంది కనకం.. రుద్రాణి కోసం విరిగిపోయిన కుర్చీపై శాలువా వేసి సిద్ధం చేసింది
Download ABP Live App and Watch All Latest Videos
View In App
స్వప్నను రెచ్చగొట్టి కావ్యకు వ్యతిరేకంగా సిద్ధం పావులు కదుపుతున్నారు రాహుల్, రుద్రాణి. వాళ్ల ముందు ఫైర్ అయిన స్వప్న..వాళ్లు వెళ్లిపోయిన తర్వాత మాత్రం ఆలోచనలో పడుతుంది

దుగ్గిరాల కుటుంబ సభ్యులంతా కలసి కనకం ఇంటికి వెళతారు..అక్కడ మొదలవుతుంది అసలు డ్రామా
ఇందిరాదేవి, అపర్ణ, రుద్రాణి, ధాన్యలక్ష్మి, స్వప్న వీళ్లంతా అందంగా అలంకరించుకుని కార్లోంచి దిగుతారు..కావ్య మాత్రం సాధారణంగా ఉంటుంది
అచ్చమైన ఆడపిల్లలా అందంగా ఉన్నావ్ అక్కా అని స్వప్నకి కాంప్లిమెంట్స్ ఇస్తుంది కావ్య. కానీ నువ్వే దారిద్ర్యానికి కేరాఫ్ లా ఉన్నావంటూ ఫైర్ అవుతుంది రుద్రాణి. మరోవైపు ధాన్యలక్ష్మి కూడా నోటికి పనిచెబుతుంది
ఇంట్లో అందరూ కూడా కావ్యను చూసి ఎందుకింత సాధారణంగా వచ్చావ్ అని ప్రశ్నిస్తారు. నేనిచ్చిన నగలన్నీ ఏమయ్యాయని అపర్ణ క్వశ్చన్ చేస్తుంది
రాజ్, కావ్య ఏం చెప్పాలో తెలియక నీళ్లు నములుతారు. చూస్తుంటే కావ్య - రాజ్ ఇన్నాళ్లుగా దాస్తున్న సీతారామయ్య 100 కోట్ల సంతకం విషయం బయటపెట్టాల్సిన అవసరం వచ్చింది. ఇప్పటికైనా కావ్య చెబుతుందో లేదో చూడాలి
బ్రహ్మముడి జనవరి 15 ఎపిసోడ్ లో కావ్య నిజం చెబుతుందో ఇంకొంత వివాదం సృష్టిస్తుందో చూడాలి