Sreemukhi : సంక్రాంతి శుభాకాంక్షలు చెప్పిన శ్రీముఖి.. ట్రెడీషనల్ లుక్‌తో ఫెస్టివల్ వైబ్ ఇస్తోన్న యాంకర్
సంక్రాంతి పండుగకి అమ్మాయిలు ఎంత అందంగా రెడీ అవుతారో తెలుసుకోవాలనుకుంటే శ్రీముఖిని చూడాల్సిందే. అచ్చమైన తెలుగమ్మాయి వైబ్స్ ఇస్తూ సంక్రాంతికి ముస్తాబైంది ఈ యాంకర్. (Images Source : Instagram/Sreemukhi)
వైట్ కలర్ లెహంగా, దానికి మ్యాచింగ్ వైట్, పింక్, బ్లూకలర్ మిక్సింగ్ ఓణి కట్టుకుని.. దానికి మ్యాచింగ్ పసుపు రంగు బ్లౌజ్ వేసుకుని ఫెస్టివల్ లుక్‌ని తీసుకొచ్చింది శ్రీముఖి. తన ఓణి స్టైల్ కూడా చాలా డిఫరెంట్‌గా కనిపించింది.(Images Source : Instagram/Sreemukhi)
లంగా ఓణి లుక్స్‌కి తగ్గట్లు నడుముకు ఒడ్డాణం, మెడలో నెక్లెస్, తలకు పాపిడి బిళ్ల పెట్టుకుని అందంగా ముస్తాబైంది శ్రీముఖి. చేతులకు నిండుగా గాజులు వేసుకోవడంతో పాటు.. ముక్కుకు పెట్టిన ముక్కెర తన లుక్‌ని మరింత గ్రేట్‌గా మార్చింది.(Images Source : Instagram/Sreemukhi)
గ్లోయింగ్, మెరిసే మేకప్ లుక్‌లో పింక్ కలర్ లిప్ స్టిక్ వేసుకుని అందంగా రెడీ అయింది. ఫోటోలకు అందంగా ఫోజులిచ్చింది. (Images Source : Instagram/Sreemukhi)
సంక్రాంతి శుభాకాంక్షలు ♥️🧿✨ అంటూ క్యాప్షన్ ఇచ్చి.. ఫోటోలు షేర్ చేసింది. Happy sankranti to you and your family ❤️❤️ అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.(Images Source : Instagram/Sreemukhi)
శ్రీముఖి ప్రస్తుతం తెలుగులో పలు షోలు చేస్తుంది. అంతేకాకుండా యూట్యూబ్‌లో వీడియోలు చేస్తుంది. అంతేకాకుండా సినిమాల్లో కూడా కనిపిస్తూ ఉంటుంది.(Images Source : Instagram/Sreemukhi)
ఈ ఇయర్ తన లైఫ్‌లో లవ్ లైన్ రావాలని కోరుకుంటున్నట్లు శ్రీముఖి తెలిపింది. తనను అమితం ప్రేమించే, అర్థం చేసుకునే వ్యక్తి లైఫ్‌లోకి వస్తే కచ్చితంగా పెళ్లి చేసుకుంటానని చెప్తోంది శ్రీముఖి.(Images Source : Instagram/Sreemukhi)