Brahmamudi Sharmitha Gowda: 'బ్రహ్మముడి' ఫేం షర్మిత గౌడ స్టన్నింగ్ లుక్ - చీరలో రుద్రాణి అత్త హోయలు చూశారా?

Brahmamudi Sharmitha Gowda Photos: స్టార్ మా సీరియల్లో బ్రహ్మముడి క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. టీఆర్పీ రేటింగ్‌లో టాప్‌లో ఉంటూ మిగతా సీరియల్లను వెనక్కినెట్టి సక్సెస్‌ఫుల్‌గా దూసుకుపోతుంది.
Download ABP Live App and Watch All Latest Videos
View In App
మొదటి ఉంచి ఈ సీరియల్‌కు అత్యధిక ప్రేక్షకాదరణ పొందుతూ టాప్‌లో కొనసాగుతుంది. ఈ సీరియల్లోని ప్రతి పాత్ర ప్రాధాన్యత ఉంది. కానీ బ్రహ్మముడి సీరియల్ అనగానే రాజ్, కావ్యల తర్వాత గుర్తొచ్చేది రుద్రాణి అత్త.

ఆమె అసలు పేరు షర్మితా గౌడ అనే విషయం తెలిసిందే. సీరియల్లో అందంతో ఆకట్టుకుంటూనే విలనిజంతో భయపెడుతుంది. సొంతవారి మధ్యే చిచ్చు పెడుతూ ఉమ్మడి కుటుంబాన్ని వేరు చేయడమే తన లక్ష్యంగా పెట్టుకుంది ఈ రుద్రాణి అత్త.
దుగ్గిరాల కుటుంబంలో ఎప్పుడెప్పుడు అగ్గి రాసుకుంటుందా? అని ఎదురచూస్తోంది ఈ రుద్రాణి అత్త. అయితే సీరియల్లో నెగిటివ్ షేడ్స్ కనిపించే ఈమె బయట మాత్రం చాలా కూల్‌గా కనిపిస్తుంది. తరచూ తన గ్లామర్ షోతో కుర్రకారు గుండెల్లో అలజడి రేపుతుంది.
నెట్టింట ట్రెండీ వేర్‌తో సర్ప్రైజ్ చేసే ఈ రుద్రాణి అత్త తాజాగా చీరలో తళుక్కున మెరిసింది. కళంకారి కాటన్ చీరలో హోయలు పోయింది. ఈ ఫోటోలు నెటిజ్లను ఆకట్టుకుంటున్నాయి. ప్రస్తుతం ఆమె ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.