Brahmamudi December 31st Episode: అనామిక బండారం బయటపడింది.. కావ్య న్యూ ఇయర్ గిఫ్ట్ గా ఏమివ్వబోతోందో - బ్రహ్మముడి డిసెంబరు 31 ఎపిసోడ్ హైలెట్స్!
కాఫీ కావాలని పనిమనిషికి ఆర్డర్ వేసిన రుద్రాణితో రోజుకి రెండుసార్లు మాత్రమే ఇమ్మన్నారని శాంత చెబుతుంది. ఫైర్ అయిన రుద్రాణితో ఎందుకొచ్చిన గొడవలే అని కాఫీ ఇస్తుంది
Download ABP Live App and Watch All Latest Videos
View In Appకార్ల రెంట్ కట్టలేక వెనక్కు పంపించేస్తుంది కావ్య. ఇంట్లో చెప్పకుండా చేస్తే గొడవచేస్తారని రాజ్ అంటే నేను చూసుకుంటాను పదండి ఆఫీసుకి వెళదాం అంటుంది
ఇదే అవకాశంగా ఇంట్లో రచ్చ లేపి కావ్యను అందరితో తిట్టించాలి...ఆస్తి దాని చేతినుంచి లాక్కోవాలి అని ప్లాన్ చేస్తారు రుద్రాణి రాహుల్..
ఆఫీసులో టెన్షన్లో ఉన్న రాజ్ ని ఏమైందని క్వశ్చన్ చేస్తుంది కావ్య. జగదీష్ గారి కాంట్రాక్ట్ పూర్తవ్వాలంటే ఇంకో 5 కోట్లు ఇన్వెస్ట్మెంట్ అవసరం అవుతుంది ఇప్పుడేం చేద్దాం అంటాడు.. డబ్బులు అడ్వాన్స్ ఇచ్చేందుకు వచ్చానని కావ్య కాల్ చేసన సంగతి చెబుతాడు జగదీష్ ప్రసాద్
జగదీష్ ప్రసాద్ ఐదు కోట్ల చెక్ ఇచ్చి వెళ్లిపోయిన తర్వాత రాజ్ ఆనందం పట్టలేక కావ్యను ఎత్తుకుని తిప్పేస్తాడు. అప్పుడే శ్రుతి లోపలకు రావడం చూసి కిందపడేస్తాడు. ఆనందం వస్తే ఎత్తుకుంటారు..ఎవరైనా వస్తే పడేస్తారు ఇదేంటండీ అంటుంది కావ్య. శ్రుతి కారణం అంటూ లోపలకు వచ్చేయడమేనా అని క్లాస్ వేస్తాడు
ఆఫీసుకి రానిచ్చారు..నిన్న పొగిడారు..ఇప్పుడు ఎత్తుకుని తిప్పేస్తున్నారు సర్ మీ మాయలో పడ్డారు మేడం అంటుంది శ్రుతి..కావ్య సిగ్గుపడుతుంది
కార్ల వ్యవహారాన్ని అడ్డంపెట్టుకుని ఇరికేంచేందుకు ప్లాన్ చేసిన రుద్రాణి..నగలు మెరుగుపెట్టుకోవాలి బయటకు వెళదాం రమ్మని ధాన్యలక్ష్మిని అడుగుతుంది. బయటకు వచ్చి చూస్తే కార్లు కనిపించవు..ఏమైందని అడిగితే ఇందాకే డ్రైవర్ వచ్చి కార్లు తీసుకెళ్లిన విషయం ధాన్యలక్ష్మితో చెబుతుంది రుద్రాణి
కోపంగా డ్రైవర్ కి కాల్ చేసి ఎక్కడ చచ్చార్రా అంటుంది ధాన్యలక్ష్మి.. తిడితే పడ్డానికి మీ భర్తను కాదంటాడు డ్రైవర్. డ్రైవర్ వి డ్రైవర్ లా ఉండు అని రుద్రాణి అంటే..నీ కొడుకులా పనీపాటా లేకుండా ఇంట్లో ఉండడం లేదంటాడు. కావ్య మేడం కార్లు పంపించేశారు ఏమైనా అడిగితే ఆమెను అడగండి అని కాల్ కట్ చేస్తాడు
కార్ల డిస్కషన్ తీసుకొచ్చి ఇంట్లో మళ్లీ గొడవ మొదలుపెడుతారు ధాన్యలక్ష్మి, రుద్రాణి. అపర్ణ కాల్ చేసి క్వశ్చన్ చేస్తే బిజీగా ఉన్నానంటుంది కావ్య. సరేలే తర్వాత మాట్లాడుకుందాం పనిలేని వాళ్లు మొదలుపెట్టిన పనికిరాని పంచాయితీ ఇది అని సెటైర్ వేసి కాల్ కట్ చేస్తుంది.
బ్రహ్మముడి జనవరి 01 ఎపిసోడ్ లో...చిట్‌ఫండ్ గ్రూప్ ఓనర్‌తో వంద కోట్లకు ఎగ్గొట్టి రాజ్-కావ్యను ఇబ్బంది పెట్టాలి అనుకుంటుంది అనామిక. ఎట్టకేలకు రాజ్ కావ్య ఆ చిట్ ఫండ్ కంపెనీ ఓనర్ ఎక్కడున్నాడో తెలుసుకుంటారు..