Brahmamudi December 27th Episode: కావ్య రాజ్ నిజం చెప్పాల్సిన టైమొచ్చింది..దుగ్గిరాలవారింట్లో మరో రచ్చ - బ్రహ్మముడి డిసెంబరు 27 ఎపిసోడ్ హైలెట్స్!
డబ్బులకోసం ధాన్యలక్ష్మి, రుద్రాణి రచ్చ చేస్తారు. ఇందిరాదేవి, అపర్ణ ని నిలదీస్తే కావ్యను సపోర్ట్ చేస్తారు. రాజ్ కూడా కళావతినే సపోర్ట్ చేస్తారు. ఇంకా ఎవరైనా మాట్లాడితే మీ అందర్నీ ఉద్యోగాలు చేసుకుని బతకమంటుందని స్ట్రాంగ్ గా చెప్పి కావ్యను చేయి పట్టుకుని తీసుకెళ్లిపోతుంది
Download ABP Live App and Watch All Latest Videos
View In Appచెల్లెలు ఇంతలా అవమానించిందని రగిలిపోతుంటుంది స్వప్న. ఇంతలో అక్కడకు వచ్చిన రుద్రాణి, రాహుల్ మరింత ఆజ్యం పోస్తారు. ఇప్పటికైనా నీవాళ్లు అంటే నేను, మా మమ్మీ అని తెలుసుకో అంటారు. వాళ్ల మాయలో స్వప్న పడుతుంది. జాగ్రత్తపడితే అందరం మన ఆస్తిన మనం తీసుకుని హ్యాపీగా బతుకుదాం అంటారు .
ఇంకా ఏం ఆలోచిస్తున్నావ్ అని రాహుల్ అడిగితే.. ఎలా ఉతికితే మీకు బుద్ధి వస్తుందా అని ఆలోచిస్తున్నా అంటుంది. మీకు పుల్లలు పెట్టే బుద్ధీ తగ్గదు..నాకు నా చెల్లిపై ప్రేమా తగ్గదు..అది నాకు చెల్లి అయినా తల్లిలాంటింది అంటుంది. మరో దెబ్బ తగిలితే ఇదే మారుతుందిలే అనుకుంటారు రుద్రాణి, రాహుల్
వంట చేసుకున్న కావ్య దగ్గరకు వెళ్లి ఫైర్ అవుతుంది స్వప్న. అందరి ముందూ తిట్టాలా అని నిలదీస్తే..నీ ఫ్యామిలీ వేరు, నా ఫ్యామిలీ వేరు అన్నావ్ అని నిలదీస్తుంద. అనేవాళ్లు అంటూనే ఉంటారు..కానీ ఎప్పుడూ అనని దానివి నువ్వు అన్నావ్ అంటుంది. ఆస్తి నీ చేతికి వచ్చేసరికి మారిపోయావ్ అంటుంది
కావాలంటే నీ ఆస్తి నుంచి ఖర్చు చేసుకో..నీకు మీ అత్తకు తేడా ఉంది అనుకున్నా..నువ్వు కూడా ఆవిడలానే ప్రవర్తిస్తే ఈ నీడ కూడా లేకుండా పోతుందంటుంది. అంటే నన్ను కూడా గెంటేస్తావా అని మండిపడుతుంది స్వప్న. ఆస్తి రాగానే ఇంతలా మారిపోతావ్ అనుకోలేదని ఏడుస్తూ వెళ్లిపోతుంది స్వప్న. కావ్య కన్నీళ్లు పెట్టుకుంటుంది...
ప్రకాశం దగ్గరకు వెళ్లి ఆవేశంతో ఊగిపోతుంటుంది ధాన్యలక్ష్మి. కుక్కలా మొరగకు..అసలు విషయం బయటపెట్టు అంటాడు. ఈ రోజు నాకు, రుద్రాణికి జరిగిన అవమానం రేపు మీకు, మన కొడుక్కి జరదనుకుంటున్నారా అంటుంది. సొంత అక్కనే అన్నది రేపు కళ్యాణ్ ని ఎందుకు అనదు అంటుంది. అన్నయ్యను అడగాలా సరే అని వెళ్లిపోతాడు ప్రకాశం
కావ్యతో మాట్లాడిన రాజ్..స్వప్నను అంతలా అనాలా? చాలా తప్పు చేశావ్ అంటాడు. తెలిసి చేసినా తెలియకుండా చేసినా తప్పే అంటుంది. ఇంటి పరిస్థితి వాళ్లకు తెలియదు కదా అంతలా అవమానించాలా అంటాడు. కొట్టుకోవడం,మళ్లీ కలసిపోవడం అలవాటే అంటుంది. నాకా నమ్మకం లేదంటాడు రాజ్
అసలే మీ అక్కకు కంగారు ఎక్కువ..స్వప్నకు-నీకు మధ్య గొడవలు పెరుగుతాయ్ కదా అని రాజ్ అంటే.. ఇంట్లో అందరూ శత్రువులా చూస్తున్నారు ఇప్పుడు ఆ లిస్టులో నా తోడబుట్టింది కూడా జాయిన్ అవుతుంది అందుకు నేను సిద్ధంగా ఉన్నాను అంటుంది. తాతయ్య మాట పూర్తయ్యేవరకూ ఎవరు ఏమన్నా పర్వాలేదు భరిస్తానంటుంది
5 లక్షల కోసం ఇంత టెన్షన్ పడాల్సి వస్తుందని అనుకోలేదని రాజ్ అంటే డబ్బును లెక్కలేకుండా ఖర్చు చేస్తే దేవుడు ఇలాగే మొట్టికాయలు వేస్తాడు అంటుంది కావ్య. స్వప్న కొన్న నెక్లెస్ అమ్మేసి హాస్పిటల్ బిల్ కట్టేద్దాం అని కావ్య అంటే..నువ్వు తనని తిట్టిందే నాకు నచ్చలేదంటాడు. తాతయ్య స్వప్నని ఇంటి కోడలిగా చూశారు కాబట్టే ఆస్తి ఇచ్చారంటాడు.
కావ్య విషయంలో మీ అన్నయ్యని నిలదీస్తారా లేదా అని ధాన్యలక్ష్మి అంటే ప్రకాశం సుభాష్ దగ్గరకు వెళతాడు..
బ్రహ్మముడి డిసెంబర్ 28 ఎపిసోడ్ లో హాస్పిటల్ బిల్ కట్టలేదని తెలిసి...అపర్ణ నిలదీస్తుంది. ఏదో పెద్ద విషయమే దాస్తున్నారని అడుగుతుంది.. కావ్య రాజ్ ముఖాలు చూసుకుంటారు