Satyabhama Serial Mounika Samineni: 'సత్యభామ' సీరియల్ లో చికాకు తెప్పిస్తున్న జిడ్డు మైత్రి... నందిని ఎప్పుడు చెక్ పెడుతుందో!
సత్యభామ సీరియల్ లో హర్ష స్నేహితురాలిగా నటిస్తోన్న మైత్రి రియల్ నేమ్ మౌనిక సామినేని. ఈమె గతంలో వంటలక్క, పడమటి సంధ్యారాగం సీరియల్స్ లో నటించింది
పెళ్లైన మగాడిని ప్రేమించడం... గత ప్రేమను కొనసాగించమని వేధించడం.. ఆ వ్యక్తి జీవితంలో నిప్పులుపోయడం..తెలుగు సీరియల్స్ లో ఇది కామన్ అయిపోయింది. సత్యభామలో మైత్రిది ఆ టైప్ క్యారెక్టరే
తనను గతంలో ప్రేమించిన వ్యక్తి మరో అమ్మాయిని పెళ్లిచేసుకుని కొత్త జీవితం ప్రారంభించడం భరించలేకపోతోంది మైత్రి. అందుకే హర్ష-నందినిని విడిదీసేందుకు విశ్వప్రయత్నాలు చేస్తోంది
వాస్తవానికి ఈ క్యారెక్టర్ మైత్రికి అస్సలు సెట్టవలేదు.. ఆ మొహం ఎప్పుడూ జిడ్డు కారుతూ స్క్రీన్ పై మరింత చికాకుగా కనిపిస్తోందంటున్నారు ప్రేక్షకులు
పైగా విలనిజం ప్రదర్శించే సీన్స్ లో..నీకో దండం తల్లీ అనేట్టుంది మైత్రి క్యారెక్టర్
సత్యభామలో మామా-కోడలి సవాల్ ఇంట్రెస్టింగ్ గా ఉంది..మైత్రి క్యారెక్టర్ పరమ బోరింగ్ అంటున్నారు సీరియల్ లవర్స్. మరి ఈ క్యారెక్టర్ కు నందిని ఎప్పుడు చెక్ పెడుతుందో చూడాలి