Paruchuri Abhinay Tej Wedding: కొత్తపల్లి గీత కుమారుడి పెళ్లి వేడుకలో సినీ, రాజకీయ ప్రముఖుల సందడి - ఫోటోలు చూశారా?
పరుచూరి రామ కోటేశ్వరరావు, అరకు మాజీ ఎంపీ కొత్తపల్లి గీత దంపతుల తనయుడు పరుచూరి అభినయ్ తేజ్ వివాహం పలువురు సినీ రాజకీయ అతిరథ మహారథుల సమక్షంలో ఘనంగా జరిగింది. మాధవి, కోటపాటి సీతారామారావు గారి అమ్మాయి అక్షతతో అభినయ్ ఏడు అడుగులు వేశారు. ఈ వివాహం డిసెంబర్ 25వ తేదీన (బుధవారం) రాత్రి 12.37 గంటలకు జరిగింది. ఈ వివాహ వేడుకలో కేంద్ర న్యాయ శాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్, కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు, మాజీ కేంద్ర మంత్రి - బీజేపీ ఎంపీ అనురాగ్ ఠాకూర్, ఏపీ హోం మంత్రి వంగలపూడి అనిత, ఆరోగ్య మంత్రి సత్య కుమార్, ఏపీ బీజేపీ అధ్యక్షురాలు - ఎంపీ పురంధేశ్వరి సహా పలువురు సినీ రాజకీయ ప్రముఖులు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appపరుచూరి రామ కోటేశ్వరరావు - కొత్తపల్లి గీత దంపతులతో పాటు కొత్త జంట అభినయ్ తేజ్, అక్షతతో తెలంగాణ మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్.
అభినయ్ తేజ్, అక్షతను ఆశీర్వదిస్తున్న ప్రముఖ దర్శకులు హరీష్ శంకర్.
కొత్త జంటతో రచయిత - దర్శకులు విజయేంద్ర ప్రసాద్.
కొత్తపల్లి గీత, కొత్త జంట అభినయ్ - అక్షతతో ఏపీ బీజేపీ అధ్యక్షురాలు - ఎంపీ పురందేశ్వరి.
అభినయ్ - అక్షతతో తరుణ్ ఫ్యామిలీ
కొత్త జంట అభినయ్ - అక్షతతో పాటు కొత్తపల్లి గీతతో హీరో నవీన్ చంద్ర ఫ్యామిలీ
శివ బాలాజీ ఫ్యామిలీ సైతం ఈ పెళ్లికి హాజరైంది.