ఇప్పటివరకూ ఓ లెక్క ఇకపై మరోలెక్క.. డబ్బు విషయంలో తగ్గేదే లే అన్న కావ్య - బ్రహ్మముడి డిసెంబరు 23 ఎపిసోడ్ హైలెట్స్!
బ్రహ్మముడి సీరియల్ కీలక మలుపులు తిరుగుతోంది. కావ్యను చూస్తేనే చికాకుపడే రాజ్ ఇప్పుడు కావ్య సహాయం అర్థించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఏం చేయాలో అర్థంకాని స్థితిలో ఉన్న రాజ్..ఏదైనా సహాయం చేయమని దీనంగా కావ్యను అడిగాడు
Download ABP Live App and Watch All Latest Videos
View In Appతాత సీతారామయ్య వందకోట్ల ష్యూరిటీ సంతకం..బ్యాంక్ వాళ్లు వచ్చి కౌంట్ డౌన్ స్టార్ట్ చేసిన విషయం..ఆస్తులు వేలం వేస్తామని చెప్పిన విషయం మొత్తం కావ్యకు చెబుతాడు. రాజ్ తో పాటూ ఆఫీసుకి వెళ్లిన కావ్య..ఇన్ స్టాల్ మెంట్స్ లో డబ్బులు కడతాం అని పర్మిషన్ అడుగుతుంది
నాలుగైదు రోజులుగా తలపగలగొట్టుకున్నా ఏం చేయలేకపోయిన రాజ్..కళావతి ఎంట్రీ ఇచ్చి బ్యాంక్ వాళ్లతో మాట్లాడడంతో హమ్మయ్య అనుకుంటాడు..మనసులో మెచ్చుకోకుండా ఉండలేకపోతాడు..
ప్రతి రూపాయి ఎంత ఇంపార్టెంట్లో ఇకపై జాగ్రత్తగా ఉండాల్సిందే అని ఫిక్సవుతుంది కావ్య. ఇంట్లోకి అడుగుపెట్టే సమయానికి రుద్రాణికి డబ్బులిస్తూ కనిపిస్తుంది స్వప్న...
ఆగండి అంటూ కావ్య తనలో ఫైర్ చూపిస్తుంది. డబ్బు అడిగిన రుద్రాణికి తెచ్చి ఇస్తుంది స్వప్న. ఇంతలో ఎంట్రీ ఇచ్చిన కావ్య.. అక్కా ఆగు.. ఇకపై డబ్బు అవసరం అని ఎవరైనా అడిగితే తీసుకున్న ప్రతి రూపాయికి లెక్క చూపించాలి అంటుంది.
కార్లో పెట్రోల్ పోయించినా కానీ నాకు బిల్ తెచ్చి ఇవ్వాలి..ఈ రూల్స్ ని స్ట్రిక్ట్ గా పాటించాలి..ఇట్స్ మై ఆర్డర్ అని స్ట్రాంగ్ గా చెబుతుంది. కోడలిని చూసి మురిసిపోతుంది అపర్ణ... రుద్రాణి, ధాన్యలక్ష్మి షాక్ అయి చూస్తారు
డబ్బులను వాయిదాలుగా కడతామన్న కావ్య..ముందుగా ఇంట్లో జరుగుతున్న వృధా ఖర్చులు అరికట్టేందుకు రంగంలోకి దిగింది. ఇప్పటివరకూ ఓ లెక్క ఇకపై మరోలెక్క అన్నట్టుంది కావ్య క్యారెక్టర్..