Brahmamudi Serial Today December 20 Highlights : రాజ్ ఇచ్చిన షాక్ కి కావ్య రియాక్షన్ ఎలా ఉండబోతోంది - బ్రహ్మముడి డిసెంబరు 20 ఎపిసోడ్ హైలెట్స్!

కల్యాణ్‌తో మాట్లాడిన అప్పు ఓసారి ఇక్కడకు రావొచ్చుకదా అంటుంది. ఇక్కడ చాలా ముఖ్యమైన పనులున్నాయి అవన్నీ చూసుకుని వస్తానని కాల్ కట్ చేస్తాడు. నా దగ్గర ఏదైనా దాస్తున్నాడా అని డౌట్ పడుతుంది కానీ..మళ్లీ అదేం ఉండదులే అనుకుంటుంది.
Download ABP Live App and Watch All Latest Videos
View In App
కావ్య వంటగదిలో పని చేసుకుంటుంటే అక్కడకు వెళ్లి రాజ్ ఏదేదో మాట్లాడుతుంటాడు. మోహమాటం లేకుండా ఎందుకొచ్చారో చెప్పండి అంటుంది. మీ ఇంట్లో మీకు మొహమాటం ఏంటి అంటే...నా ఇల్లు కాదు మన ఇల్లు అంటాడు...అదీ అదీ అంటూ టీ కావాలని అడుగుతాడు.

నువ్వు పనిలో ఉన్నావ్ కదా నేను పెట్టుకుంటాలే అంటాడు. టీ పెట్టుకుంటున్న రాజ్ దగ్గరకు వచ్చిన అపర్ణ.. వేయాల్సింది కాఫీ పొడి కాదు అని చెప్పి టీ పెట్టి ఇస్తుంది. నన్ను, కావ్యను అడగొచ్చు కదా అంటే..కావ్య పనిలో ఉంది కదా అంటాడు. నువ్వు ఒకరి ఇబ్బంది గురించి కూడా ఆలోచిస్తున్నావా అంటుంది.
మంచిగా ఉన్నా మీతో బాధే..తల్లీ-పెళ్లాం మధ్య నలిగిపోతున్నా అని సెటైర్ వేస్తాడు. నిజంగా నీలో మార్పు వస్తే సంతోషమే కానీ..ఇంత తొందరగా రావడం ఆశ్చర్యమే అంటుంది అపర్ణ. రాజ్ వెళ్లిపోయిన తర్వాత.. నీ విషయంలో వాడిలో మార్పు వస్తోంది అంటుంది.. కావ్య సిగ్గుపడుతుంది
కావ్య బూజు దులుపుతుంటే గమనించిన రాజ్.. బెడ్ పై తూలి పడుతుందేమో అని సడెన్ గా కళావతి అని పిలుస్తాడు..ఉలిక్కిపడి కిందపడబోతున్న కావ్యను పట్టుకుంటాడు. అంత సడెన్ గా పిలిస్తే దడుసుకున్నా అంటుంది. ఊరుకో కళావతి నువ్వు భయపడడం ఏంటి ఆడపులివి, ఆడ సింహానివి అంటాడు
నీకు ఏ విధంగా సహాయపడగలను అంటే.. సీలింగ్ మొత్తం క్లీన్ చేయాలి మీరు పెడతారా అంటుంది.. బెడ్ ఎక్కి సీలింగ్ క్లీన్ చేస్తాడు. రాజ్ పని చేస్తూ తూలి పడుతుంటే కావ్య పట్టుకుంటుంది..బెడ్ పై పడిన ఇద్దర్నీ అప్పుడే అటుగా వచ్చిన రుద్రాణి, ధాన్యలక్ష్మి కోపంగా చూసి వెళ్లిపోతారు .
వేళాపాళా లేకుండా ఆ ముద్దు ముచ్చట ఏంటి అని చికాకు పడతారు ధాన్యం, రుద్రాణి. వాళ్లిద్దరూ కలసిపోతే మనగతి అధోగతి అంటుంది రుద్రాణి. ఇల్లు కావ్య చేతిలో, ఆఫీస్ రాజ్ చేతిలోకి పూర్తిగా వెళ్లిపోతుంది అనుకుంటారు
రాజ్ మారిపోయాడు కావ్యపై ప్రేమను చూపిస్తున్నాడని సుభాష్ తో చెబుతుంది అపర్ణ. అదే జరిగితే సమస్యలన్నీ తీరిపోతాయ్ అంటాడు సుభాష్ . కావ్య కూడా రాజ్ లో మార్పు వచ్చింది అనుకుంటుంది
బ్యాంక్ మేనేజర్ రాజ్ కు కాల్ చేసి..రేపు ఆఫీసుకి వస్తున్నాం అమౌంట్ సెటిల్ చేయాలి అంటాడు. ఇక కావ్యతో మాట్లాడాల్సిందే అని వెళతాడు రాజ్. డోర్ వేయనా, గడియ పెట్టనా అని రాజ్ అడిగితే.. సిగ్గు పడుతూ మీ ఇష్టం అంటుంది.
బ్రహ్మముడి డిసెంబర్ 21 ఎపిసోడ్ లో... ఓ పెద్ద సమస్యలో ఉన్నాను నువ్వే నాకు సహాయం చేయాలంటాడు.. జరిగినదంతా చెప్పి కావ్యను హగ్ చేసుకుని ఎమోషనల్ అవుతాడు రాజ్.