Brahmamudi Serial Today June 20th Episode:పెళ్లి ఆపిన రుద్రాణి, యామిని అరెస్ట్, అయోమయంలో రాజ్ - బ్రహ్మముడి జూన్ 20 ఎపిసోడ్ హైలెట్స్!
కావ్యతో మాట్లాడుతూ రాజ్ ఎమోషనల్ అవుతాడు. తాను ఇష్టపడిన వ్యక్తి దూరమవుతుంటే బాధ పెరిగిపోతోందని బాధపడతాడు. మీక్కూడా నాలాగే ఉందికదూ అంటాడు. పైకి ఏమీ మాట్లాడలేక మౌనంగా ఉండిపోతుంది కావ్య
Download ABP Live App and Watch All Latest Videos
View In Appతెల్లారితే పెళ్లికి సిద్ధమైన మీరు ఈ టైమ్ లో బయటకు పిలిచి మాట్లాడడం తప్పు అంటుంది కావ్య. నాకు ఏం కావాలో క్లారిటీ ఉంది మీకు ఏం కావాలో నిర్ణయం తీసుకోండి అనేసి వెళ్లిపోతుంది కావ్య
అపర్ణ, కనకం, ఇందిరాదేవి కూర్చుని ఆలోచిస్తుంటారు. అటుగా వెళుతున్న రుద్రాణి, రాహుల్ ఏం జరుగుతుందో చూద్దాం అని పక్కకు దాక్కుంటారు. ఇంతలో అప్పు, కళ్యాణ్ వచ్చి యామిని వీడియో తీసిన విషయం చెబుతారు
వెంటనే యామినిని అరెస్ట్ చేసి తీసుకెళ్లు అప్పు అంటుంది కనకం. దానికి ఓ ప్రొసిజర్ ఉంటుంది రేపు పొద్దున్నే అరెస్ట్ చేస్తాను అంటుంది అప్పు
ఎవరికి దొరకకూడదో సాక్ష్యం వాళ్లకే దొరికిందని టెన్షన్ పడిన రాహుల్, రుద్రాణి..నేరుగా యామిని దగ్గరకు వెళ్లి చెబుతారు. మీరు ఏమీ మాట్లాడకండి, నిజం తెలిసినట్టు ఉండొద్దు..నేను చూసుకుంటా అంటుంది యామిని
కావ్య హడావుడిగా తిరుగుతుంటుంది..రాజ్ బాధపడుతుంటాడు. ఇలాంటి రోజు వస్తుందని అనుకోలేదంటాడు కళ్యాణ్.
యామిని తండ్రి వచ్చి కావ్యను పిలిచి..ఈ పెళ్లి ఆపొద్దని రిక్వెస్ట్ చేస్తాడు. నేను ఆపను అదే ఆగిపోతుందనే నమ్మకం నాకు ఉంది అంటుంది కావ్య. మీ కూతురు గురించి స్వార్థంగా ఆలోచిస్తున్న మీరు మరో తండ్రిని బాధపెడుతున్నానన మర్చిపోతున్నారు అనేసి వెళ్లిపోతుంది
రాజ్ ఒంటరిగా కూర్చుని ఆలోచిస్తుంటే.. కనకం, ఇందిరాదేవి, అపర్ణ వచ్చి ఓదార్చుతారు. కళానతి నిన్నే ప్రేమిస్తోంది ఈ పెళ్లి ఎలాగూ జరగదులే అంటారు
పెళ్లికూతురిగా ముస్తాబు చేసి యామినిని తీసుకెళుతుంటే..కావ్య ఎదురుపడుతుంది. కాసేపట్లో మా పెళ్లి అని యామిని రెచ్చగొడుతుంది.. అది జరగదులే కావ్య ఇచ్చిపడేస్తుంది
బ్రహ్మముడి జూన్ 21 ఎపిసోడ్ లో పెళ్లి జరుగుతుండగా..బిల్డప్ కోసం రాహుల్, రుద్రాణి ఈ పెళ్లి ఆపండి అని అరుస్తారు. ఇంతలో పోలీసులు వచ్చి వీడియో సంగతి బయటపెడతారు. యామినిషాక్ అవుతుంది