Brahmamudi Serial Today March 22nd Episode Highlights: యామిని ఆటకు కౌంట్ డౌన్ మొదలైంది.. నెల రోజుల్లో రాజ్ ని తీసుకొస్తానని కావ్య శపథం - బ్రహ్మముడి మార్చి 22 ఎపిసోడ్ హైలెట్స్!

రాజ్ - యామినితో హాస్పిటల్లో డాక్టర్ మాట్లాడింది మొత్తం వింటుంది కావ్య. గతం గుర్తుచేసేందుకు ఎక్కువగా ఒత్తిడికి గురిచేయకూడదు అన్న మాట విని కంగారుపడుతుంది.
Download ABP Live App and Watch All Latest Videos
View In App
నీ గతాన్ని గుర్తుచేయను..జస్ట్ చూపిస్తాను రా అంటూ తాను సృష్టించిన ప్రపంచంలోకి రాజ్ ని తీసుకెళుతుంది యామిని. వెనుకే ఫాలో అవుతుంది కావ్య

రూంలో పడుకున్న అపర్ణను లేపేందుకు ప్రయత్నిస్తుంది ఇందిరాదేవి..ఎప్పటికీ లేవకపోవడంతో ఏదో జరిగిపోయిందంటూ రుద్రాణి మళ్లీ నోరు పారేసుకుంటుంది. పిచ్చి కావ్య నోరు మూయిస్తే కానీ ఇంట్లో పరిస్థితులు మారవు అంటూ విసురుగా వెళ్లిపోతుంది
యామిని, రాజ్ ఒక స్కూల్ దగ్గరకు వెళ్లగానే కావ్య కూడా వెనుకే వెళుతుంది. అక్కడున్న వాచ్ మెన్ లోపలకు పంపించడు. తనకి ఆ రోజు పెళ్లి చూపులు అని తెలుసుకుని ...నా చెల్లెలే నిన్ను పెళ్లి చేసుకుంటోంది నేను ఎంక్వైరీ కోసం వచ్చానని చెప్పి నాటకం ఆడి స్కూల్లోకి వెళుతుంది
రాజ్ అక్కడే చదివాడని, చిన్నప్పుడు చేసిన అల్లర్లు ఇవేనని ప్రిన్సిపాల్ పెద్ద కథే చెబుతుంది. యామిని కూడా వంత పాడుతుంది. చిన్నప్పుడు స్కూల్లో నువ్వు చాలా అల్లరి చేసేదానివి నిన్ను కంట్రోల్ చేయలేక మా బావ చాలా ఇబ్బందిపడేవాడు అని ప్రిన్సిపాల్ చెబుతుంది
ఇదంతా విన్న కావ్య ఏదో పెద్ద కుట్రే జరుగుతోందని అర్థం చేసుకుంటుంది
బ్రహ్మముడి మార్చి 25 ఎపిసోడ్ లో ఇంటికి డాక్టర్ వస్తాడు..పేషెంట్ ఎక్కడ హడావుడిచేస్తుంటాడు. నేను పిలిపించాను అంటుంది రుద్రాణి. కావ్య మళ్లీ మళ్లీ అదే మాట చెప్పడంతో నమ్మకం ఏంటని నిలదీస్తుంది. నెలరోజులు గడువు అడుగుతుంది కావ్య...