Protein Food : వెజిటేరియన్స్ ప్రోటీన్ కోసం వీటిని తింటే మంచిది.. నాన్‌వెజ్ లేకుండా హెల్తీ ఆప్షన్

వయసు పెరిగే కొద్ది శరీరానికి ప్రోటీన్ అందించడం చాలా అవసరం. ఇది కండరబలం క్షీణించకుండా.. బలాన్ని అందిస్తుంది. అందుకే వీటిని రెగ్యులర్‌గా డైట్లో తీసుకోవాలి.
Download ABP Live App and Watch All Latest Videos
View In App
మీరు వెజిటేరియన్స్ అయి ఉండి.. మీకు ప్రోటీన్ సోర్స్ తక్కువ ఉందని భావిస్తున్నారా? అయితే కొన్ని ఫుడ్స్ మీ డైట్లో చేర్చుకోండి.

Legumes : చిక్కుళ్లు, శనగలు, బ్లాక్ బీన్స్, కిడ్నీ బీన్స్, సోయాబీన్స్ వంటివాటిలో ప్రోటీన్ పుష్కలంగా ఉంటుంది. వీటిని ప్రోటీన్ సోర్స్‌లో భాగంగా డైట్లో చేర్చుకోవచ్చు.
Nuts and seeds : బాదం, చియా సీడ్స్, గుమ్మడి గింజలు, సన్‌ఫ్లవర్ సీడ్స్ ఇవన్నీ ప్రోటీన్ సోర్స్‌తో నిండి ఉంటాయి. కాబట్టి వీటిని స్నాక్స్‌గా, సలాడ్స్, స్మూతీల రూపంలో తీసుకోవచ్చు.
Whole grains : వైట్ రైస్‌కి బదులు క్వినోవా, బ్రౌన్ రైస్, మల్టీగ్రైన్ బ్రెడ్‌తో ప్రోటీన్ లభిస్తుంది. పైగా ఇవి ఆరోగ్యానికి మేలు చేస్తాయి.
Vegetables : కూరగాయల్లో బ్రకోలీ, పాలకూర, కాలే, బెల్ పెప్పర్స్ వంటివాటిలో ప్రోటీన్ మంచి మోతాదులో ఉంటుంది. వీటితో పాటు టోఫును కూడా మీరు డైట్లో చేర్చుకోవచ్చు.