Bananas in the Fridge : అరటిపండ్లను ఫ్రిడ్జ్‌లో పెడుతున్నారా? అయితే జాగ్రత్త.. పెడితే జరిగే నష్టాలివే
అరటి పండ్లలో ఐరన్, పొటాషియం, కాల్షియం, జింక్, భాస్వరం మూలకాలు ఉంటాయి. వీటిలోని పోషకాలు ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు అందిస్తాయి.
ఆరోగ్య ప్రయోజనాలు అందించే ఈ పండ్లు బయట ఉంచినా ఎక్కువకాలం పాడవకుండా ఉంటాయి. అయితే వీటిని చెడిపోకుండా ఉండాలని కొందరు ఫ్రిడ్జ్‌లో పెడతారు.
కానీ అరటిపండ్లను ఫ్రిడ్జ్‌లో పెట్టకూడదట తెలుసా? ఫ్రిడ్జ్‌లో ఉంచడం వల్ల ఎక్కువకాలం చెడిపోకుండా ఉంటాయి. అయితే వాటిని తింటే కొన్ని ఆరోగ్య సమస్యలు వస్తాయి.
అరటిపండ్లలోని ఇథిలీన్ అనే వాయువు విడుదల అవుతుంది. ఇది ఇతర ఆహార పదార్థాలను ప్రభావితం చేస్తుంది.
అరటిపండ్లలో శరీరాన్ని కూలింగ్ చేసే లక్షణాలు ఉంటాయి. కాబట్టి వీటిని ఫ్రిడ్జ్‌లో పెట్టి తింటే.. అనారోగ్యానికి గురవుతారు.
అరటిపండ్లు పచ్చిగా ఉంటే.. వాటిని ఫ్రిడ్జ్‌లో పెట్టుకోవచ్చట. కానీ ఎక్కువగా పండిన వాటిని అసలు స్టోర్ చేయవద్దని చెప్తున్నారు.
ఆరోగ్య ప్రయోజనాల కోసం రోజూ అరటిపండు తింటే మంచిదే. కానీ ఎక్కువమోతాదులో తీసుకుంటే మంచిది కాదు. అలాగే స్టోర్ చేయడానికి మాత్రం ఫ్రిడ్జ్ ఉపయోగించకూడదు.