Priyanka Jain: పెళ్లెప్పుడు ప్రియాంక - అప్పుడే అంత వయస్సు వచ్చేసిందా? ఇక పప్పు అన్నం పెట్టాల్సిందే అంటున్న ఫ్యాన్స్
ప్రియాంక జైన్.. ‘బిగ్ బాస్’తో ఈ పేరు అందరికి నోటెడ్ అయ్యింది. అంతకు ముందు అంతా జానకీ అనే పిలిచేవారు. ‘జానకి కలగనలేదు’ సీరియల్‌తో ప్రియాంకకు మంచి పేరు వచ్చింది. ఆ తర్వాత ఆమె ‘బిగ్ బాస్’ సీజన్ 2తో మరింత పాపులారిటీ సంపాదించింది. - Priyanka Jain / Instagram
Download ABP Live App and Watch All Latest Videos
View In Appజులై 2న ప్రియాంక బర్త్ డే. ఈ సందర్భంగా ఆమె పాల్గొంటున్న పలు షోస్‌తోపాటు.. ఇంట్లో కూడా పుట్టిన రోజు వేడుకలు జరిగాయి. - Priyanka Jain / Instagram
ఇంట్లో జరిగిన బర్త్ డే వేడుకల్లో ఆమె తల్లిదండ్రులు, సోదరుడితోపాటు.. ఆమె ప్రియుడు కూడా పాల్గొన్నాడు. ఆ ఫొటోలను ప్రియాంక ఇన్స్టాగ్రామ్ ద్వారా అభిమానులతో పంచుకుంది. - Priyanka Jain / Instagram
ప్రస్తుతం ప్రియాంక జైన్ చేతిలో సీరియల్స్ ఏవీ లేవు. ఆమె తన ప్రియుడు శివ కుమార్‌తో కలిసి సహజీవనం చేస్తోంది. అయితే, వీరు ఇప్పటి వరకు పెళ్లి ఊసు ఎత్తడం లేదు. - Priyanka Jain / Instagram
ప్రియాంక ప్రస్తుతం యూట్యూబ్ చానెల్‌తో బిజీగా ఉంది. ఆమె ప్రియుడు మాత్రం పలు తెలుగు సీరియల్స్‌లో నటిస్తున్నాడు. ఈ రోజుతో ప్రియాంకకు 26 ఏళ్లు వచ్చేశాయ్. దీంతో ఆమె ఫ్యాన్స్ పెళ్లి కబురు చెప్పాలంటూ ఆమెను ఇబ్బంది పెడుతున్నారు. - Priyanka Jain / Instagram
ప్రియాంక జైన్.. ‘బిగ్ బాస్’ సీజన్ ద్వారా అభిమానులను మంచిగానే సంపాదించింది. అయితే, విన్నర్ కాలేకపోయింది. కానీ, పొట్టి పిల్ల గట్టిదే అనిపించుకుంది. - Priyanka Jain / Instagram