YS Jagan: బెంగళూరు నుంచి తిరిగొచ్చిన వైఎస్ జగన్, గన్నవరం ఎయిర్పోర్టులో ఏపీ మాజీ సీఎంకు ఘన స్వాగతం
ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బెంగళూరు పర్యటన ముగించుకుని రాష్ట్రానికి తిరిగొచ్చారు. వైఎస్సార్ సీపీ అధినేత కొన్ని రోజుల నుంచి బెంగళూరులోని తన నివాసంలో గడిపారు.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appమంగళవారం (జులై 2న) వైఎస్ జగన్ బెంగళూరు పర్యటన ముగించుకుని గన్నవరం ఎయిర్పోర్ట్కు చేరుకున్నారు. వైసీపీ అధినేత రాక గురించి తెలుసుకున్న వైయస్ఆర్ సీపీ నేతలు, శ్రేణులు భారీ ఎత్తున ఎయిర్ పోర్టుకు చేరుకుని వైఎస్ జగన్కు ఘన స్వాగతం పలికారు.
బెంగళూరు నుంచి తిరిగొచ్చిన వైఎస్ జగన్ తనకు స్వాగతం పలకడానికి వచ్చిన పార్టీ నేతలు, శ్రేణులు, అభిమానులు అందరికీ అభివాదం చేశారు.
ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ 151 సీట్ల నుంచి 11 స్థానాలకు పడిపోయింది. ఎన్నికల ఫలితాల తరువాత కొన్ని రోజులు తాడేపల్లి నివాసంలో ఉన్న ఆయన అనంతరం సతీమణి భారతీరెడ్డితో కలిసి బెంగళూరుకు వెళ్లిపోయారని తెలిసిందే.
గన్నవరం ఎయిర్పోర్టు నుంచి వైఎస్ జగన్ రోడ్డు మార్గంలో తాడేపల్లి నివాసానికి వెళ్లనున్నారు. జూన్ నెలలో పులివెందులకు వెళ్లిన జగన్ అక్కడి నుంచి బెంగళూరుకు వెళ్లి అక్కడ కొన్ని రోజులు ఉన్నారు.
ఎన్నికల అనంతరం పార్టీ పరిస్థితిపై, రాష్ట్రంలో ప్రస్తుత రాజకీయాలపై వైఎస్సార్ సీపీ ముఖ్యనేతలు, మాజీ మంత్రులతో వైసీపీ అధినేత జగన్ వరుస భేటీలు కానున్నారని సమచారం.