Bhanumathi Serial Today March 24th Episode Highlights: మనసే తడిసి అలలా కరిగిపోదా.. భానుని కలిసే దారి కోసం పార్థు ఆలోచన - భానుమతి మార్చి 24ఎపిసోడ్ హైలెట్స్!

బస్ అమ్మాయితో ప్రేమలో పడిన పార్థు.. జీపబ్బాయ్ అంటూ మురిసిపోయే భాను.. ఒకరిపై ప్రేమను మరొకరు చెప్పుకోవడానికి ముందే ఎడబాటు వచ్చింది
Download ABP Live App and Watch All Latest Videos
View In App
తన కూతురే పార్థు భార్యకావాలని శాంభవి వేసిన కుట్రకు పార్థు బలయ్యాడు. భాను తల్లిని శాంభవి అవమానించడంతో మరోసారి తన కూతురి వంక చూడొద్దని వేడుకుంది ప్రమీల

క్షమాపణలు చెప్పి వచ్చేసిన పార్థు అనుక్షణం భాను ఆలోచనల్లో, ఆమె తల్లి పెట్టిన కండిషన్ గురించి తలుచుకుంటూ బాధపడతాడు.
పార్థు తీరుని గమనించిన సవతితల్లి శారద..కొడుకు ప్రేమ గెలిపించేందుకు భర్తను ఒప్పించే ప్రయత్నాల్లో పడింది. తీసుకునే ఫుడ్ విషయంలో కాంప్రమైజ్ అవ్వలేం జీవితం విషయంలో ఎలా అని ఆలోచింపచేసేలా మాట్లాడుతుంది
మరోవైపు పార్థు పిన్ని శక్తి కూడా భానుతో పెళ్లిచేయాలనే ఆలోచనలోనే ఉంది. ఇంత పరువుగల ఇంటికి కోటిగాడు వియ్యంకుడు అవడానికి వీల్లేదు అంటాడు. ఎలాగైనా భానుతో పార్థు పెళ్లి చేసి వాళ్లని తన గుప్పిట్లో పెట్టుకోవాలి అనుకుంటుంది
మంచి ఆలోచనతో శారద, చెడు ఆలోచనతో శక్తి..ఇద్దరూ పార్థు-భాను పెళ్లిచేయాలని ఫిక్సవుతారు. శాంభవి మాత్రం ఎలాగైనా భువననే కట్టబెట్టాలనే ఆలోచనలో ఉంది.
తాగుబోతు కోటిగాడు భానుకి పెళ్లిచూపులు ఏర్పాటు చేశాడు. ఒప్పుకోకుంటే నీ తల్లిని చంపేస్తానంటూ బెదిరిస్తాడు. తప్పనిసరై తలొంచుతుంది భాను. ఆ సమయంలో పార్థు ఎంట్రీ ఇస్తాడా...
తప్పనిపరిస్థితుల్లో పార్థుని పెళ్లిచేసుకునేందుకు భాను అంగీకరిస్తుందా... ఇద్దరి జీవితం ఎలాంటి మలుపులు తిరగబోతోంది...