Vaishnavi Chaitanya: మోడ్రన్‌గా మారిన వైష్ణవి చైతన్య... 'జాక్' కోసమేనా బేబీ?

Siddhu Jonnalagadda's Jack movie actress Vaishnavi Chaitanya photos: 'డీజే టిల్లు', 'టిల్లు స్క్వేర్' సినిమాలతో యూత్ ఆడియన్స్ లో స్పెషల్ క్రేజ్ సొంతం చేసుకున్న హీరో సిద్దు జొన్నలగడ్డ. 'బేబీ' సినిమాతో ప్రేక్షకుల మనసు దోచిన హీరోయిన్ వైష్ణవి చైతన్య. వీళ్ళిద్దరూ జంటగా నటించిన సినిమా 'జాక్'. కొంచెం క్రాక్... అనేది క్యాప్షన్. ఈ సినిమా కోసమే అన్నట్లు వైష్ణవి చైతన్య మంచి మోడరన్ డ్రెస్ ధరించి ఫోటోషూట్ చేశారు. (Image Courtesy: vaishnavi_chaitanya / Instagram)
Download ABP Live App and Watch All Latest Videos
View In App
ఏప్రిల్ 10న థియేటర్లలోకి 'జాక్' సినిమా వస్తోంది. ఆల్రెడీ విడుదలైన టీజర్, సాంగ్స్ ఆడియన్స్ అందరికీ నచ్చాయి. రీసెంట్ గా రిలీజ్ చేసిన రెండో సాంగ్ 'కిస్' హిట్ అయింది. ఇప్పటి వరకు రిలీజ్ చేసిన పబ్లిసిటీ మెటీరియల్ చూస్తే వైష్ణవి చైతన్య ట్రెడిషనల్ డ్రెస్ లలో ఎక్కువ కనిపించారు. కానీ సినిమాలో ఆవిడ క్యారెక్టర్ మోడరన్ గా ఉంటుందట. (Image Courtesy: vaishnavi_chaitanya / Instagram)

'బేబీ' సినిమాతో వైష్ణవి చైతన్య భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు అయితే ఆ తర్వాత ఆవిడ నటించిన 'లవ్ మీ' అంతగా ప్రేక్షకుల ఆదరణ సొంతం చేసుకోలేదు. దాంతో ఇప్పుడు ఈ 'జాక్' సినిమాతో భారీ విజయం మీద ఆవిడ కన్నేశారు. (Image Courtesy: vaishnavi_chaitanya / Instagram)
ట్రెడిషనల్ రోల్స్, అలాగే మోడరన్ గర్ల్ క్యారెక్టర్లు చేయడానికి తాను రెడీ అన్నట్లు ఫోటోషూట్ లేదూ?! మోడ్రన్ దుస్తులు ధరించినప్పటికీ వైష్ణవి చైతన్య ఎప్పుడు హద్దు మీరలేదు. (Image Courtesy: vaishnavi_chaitanya / Instagram)
వైష్ణవి చైతన్య బ్లాక్ డ్రెస్ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. (Image Courtesy: vaishnavi_chaitanya / Instagram)
వైష్ణవి చైతన్య యూట్యూబ్ ఫిలిమ్స్ నుంచి కెరియర్ స్టార్ట్ చేసి ఇప్పుడు ఈ స్థాయికి వచ్చారు. తెలుగు అమ్మాయిలు అందరికీ ఆవిడ ఒక ఇన్స్పిరేషన్ అని చెప్పవచ్చు. (Image Courtesy: vaishnavi_chaitanya / Instagram)