Bhanumathi Serial Today March 21 Episode Highlights: ఎంతనుకున్నా ఏదో బాధ మెలిపెడుతోందే లోపల .. భాను ఇంటి ముందు పార్థు - భానుమతి మార్చి 21 ఎపిసోడ్ హైలెట్స్!

తన బాబాయ్ విశ్వనాథం దగ్గర కూర్చుని పార్థు ఎవరో అమ్మాయిని ఇష్టపడ్డాడు అని చెబుతాడు బలరాం. కళ్యాణం సమయంలో మనపక్కనే కూర్చున్న అమ్మాయి అనగానే..సందేహిస్తాడు విశ్వనాథం
Download ABP Live App and Watch All Latest Videos
View In App
ఇదే అవకాశంగా భానుమతి ఎవరి కూతురో బయటపెడుతుంది శక్తి. గుడిలో మీకు ఎదురైన తాగుబోతే ఆ అమ్మయి తండ్రి అని చెబుతుంది శక్తి. అలాంటివాడి కూతుర్నా నా పార్థు ఇష్టపడ్డాడు అని బలరాం ఫైర్ అవుతాడు.

తండ్రి తాగుబోతు అయినా కూతురు కుందనపు బొమ్మ అంటుంది శక్తి. వాడి ఇష్టం కోసం కుటుంబం స్థాయిని తగ్గించను .. ఆ అమ్మాయికి మనింట్లో కోడలిగా అడుగుపెట్టే అర్హత లేదనేస్తాడు
ఇదంతా విన్న పార్థు బాధపడతాడు. బావ ఏదో ఆవేశంలో మాట్లాడి ఉంటారు నువ్వేం బాధపడకు అని చెబుతాడు సూరి. నా ప్రేమను నిలబెట్టుకోవాలా వదులుకోవాలా అని బాధపడతాడు
ప్రమీల భోజనం తీసుకుని విశ్వనాథం ఇంటికి వస్తుంది..ఆమె భానుమతి తల్లి అని తెలుసుకుని శాంభవి, భువన టార్గెట్ చేస్తారు. కూటికి గతిలేనివాళ్లకి కోట్లకు పడగలెత్తే వాళ్లు కావాలని అంటుంది
మా దగ్గర ఆస్తులు లేకపోవచ్చు కానీ ఆత్మాభిమానం ఉందంటుంది ప్రమీల. నీ కూతురు నా మేనల్లుడిని బుట్టలో వేసుకునేందుకు చూస్తోందని ప్రమీలతో చెబుతుంది శాంభవి. ఇదంతా బలరాం పెద్దకోడలు వింటుంది .
బలరాం మాటలు తలుచుకుని పార్థు బాధపడుతుంటే..అక్కడకు వచ్చిన బలరాం పెద్దకోడలు ఓదార్చుతుంది. భానుమతి తల్లి ప్రమీలను శాంభవి అవమానించిన విషయం గురించి చెబుతుంది. నేను క్షమించమని అడుగుతాను అని వెళతాడు పార్థు
భానుమతి చదువుకుంటుంటే ఆ పక్కనే కోటిగాడు తాగుతుంటాడు. కోపంగా వచ్చిన ప్రమీలను చూసి వెళ్లేటప్పుడు శాంతంగా వెళ్లి ఇప్పుడు కోపంగా వచ్చావేంటి అంటుంది కుమారి. మందు కొట్టే కొడుకు మంది సొమ్ము కొట్టేసే తల్లి అంటూ ఫైర్ అవుతుంది
భానుమతి మార్చి 22 ఎపిసోడ్ లో పార్థు క్షణాపణలు చెప్పేందుకు వెళ్లడంతో.. మీరు ఇలా వచ్చినట్టు తెలిస్తే మాపై మరో నింద వేస్తారు బాబు అని పార్థుకి చెప్పి పంపించేస్తుంది ప్రమీల