Bhanumathi Serial Today March 17th Episode 06 Highlights: బస్ అమ్మాయే కావాలన్న జీప్ అబ్బాయ్.. అప్పుడే భానుని టార్గెట్ చేసిన భువన - భానుమతి మార్చి 17 ఎపిసోడ్ హైలెట్స్!

పార్థు పెళ్లి చెడగొట్టే పనిలో మేనత్త ఉంది.. పార్థుకి పెళ్లికాదనే ఆలోచనలో ఉంది పిన్ని శక్తి. నెల రోజుల్లో మంచి సంబంధం చూసి పెళ్లిచేస్తానని శపథం చేశాడు బలరాం
Download ABP Live App and Watch All Latest Videos
View In App
అనుకోకుండా భానుమతిని చూసి ప్రేమలో పడిన పార్థు..ఎదేమైనా భానునే పెళ్లిచేసుకోవాలనే ఆలోచనతో ఉంటాడు. రాములోరి కళ్యాణం జరిపించే సమయంలోనూ భాను ఆలోచనలోనే ఉంచాడు

రాముడికి అర్జీ పెట్టుకున్న పార్థు..ఆ బస్ అమ్మాయే నాకు భార్యగా రావాలని కోరుకుంటాడు. అదే సమయానికి పెన్ను తీసుకొచ్చి పరీక్ష బాగా రాయాలని దేవుడికి దండం పెట్టుకుంటుంది.
అనుకోకుండా ఓ దండ ఎగిరివచ్చి పార్థు-భాను మెడలో పడుతుంది.. పార్థు సంతోషిస్తాడు..భాను ఆ దండ తీసేసి వెళ్లిపోతుంది. వెనుకే వెళ్లిన పార్థు పలకరిస్తాడు.
కాసేపు ఇద్దరూ సరదాగా మాట్లాడుకుంటూ ఉంటారు..ఇదంతా భువన, పార్థు మేనత్త చూస్తారు. నిన్నరాత్రి పార్థుకోసం వచ్చిన అమ్మాయి ఈమెనే.. ఇద్దరి మధ్యా సమ్ థింగ్ సమ్ థింగ్ అని ఫిక్సవుతారు.
ఏదో ఒకటి చేయమని..పార్థుతో తనకే పెళ్లి జరగాలని డిమాండ్ చేస్తుంది భువన. అదంతా నేను చూసుకుంటానని హామీ ఇస్తుంది భువన తల్లి..
సీతారాముల కళ్యాణం జరుగుతుంటుంది..పార్థు కుటుంబం పక్కనే కూర్చుంటుంది భాను. పార్థు అలా భానునే గమనిస్తుంటాడు. అదంతా పార్థు సవతి తల్లి శారద చూస్తుంది.. ఆమె సహకారంతోనే పెళ్లి జరుగుతుందేమో..చూడాలి..
అంటే భానుమతి ఆ ఇంట్లో కోడలిగా అడుగుపెట్టకముందే.. ఓ వైపు భువన, మరోవైపు పార్థు మేనత్త, పార్థు పిన్ని నుంచి వ్యతిరేకత స్టార్ట్ అయింది...