Tv Actresses Marriage : ఈ సీరియల్ హీరోయిన్స్ రియల్ లైఫ్ పార్ట్నర్స్ వీళ్లే!
బుల్లితెరపై హీరోయిన్లుగా, యాంకర్లుగా రాణిస్తున్న చాలా మంది తారలు ఇండస్ట్రీతో సంబంధం లేని వాళ్లను పెళ్లి చేసుకొని హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తున్నారు. వీళ్లు సోషల్ మీడియాలో షేర్ చేసే ఫోటోలు, వీడియోలు తెగ వైరల్ అవుతుంటాయి. మరి ఆ జంటలెవరో ఇప్పుడు చూసేద్దాం!
Download ABP Live App and Watch All Latest Videos
View In Appహాట్ యాంకర్ అనసూయ టీనేజ్ నుండే సుశాంక్ అనే వ్యక్తిని ప్రేమించింది. తొమ్మిదేళ్ల పాటు రిలేషన్ లో ఉన్న ఈ జంట పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. సుశాంత్ బ్యాంకు సెక్టార్ లో పని చేస్తున్నారు.
ప్రముఖ యాంకర్ లాస్య.. మంజునాథ్ అనే వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. మరాఠీ కుటుంబానికి చెందిన మంజునాథ్ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పని చేస్తున్నారు. అతడితో పరిచయం, ప్రేమ, పెళ్లి ఇలా అన్ని విషయాల గురించి బిగ్ బాస్ సీజన్ 4లో తెలిపింది లాస్య.
'కథలో రాజకుమార్' సీరియల్ హీరోయిన్ ఆషిక పదుకోన్ కి చేతన్ శెట్టి అనే వ్యక్తితో వివాహం జరిగింది. చేతన్ బెంగుళూరులో ఓ సాఫ్ట్ వేర్ కంపెనీలో పని చేస్తుంటారు.
నటి హరితేజ కర్ణాటకకు చెందిన దీపక్ రావుని వివాహం చేసుకుంది. బిగ్ బాస్ హౌస్ లో ఉన్న సమయంలో హరితేజ చాలా సార్లు దీపక్ గురించి మాట్లాడేది. ఈ మధ్యనే ఈ దంపతులు ఓ బిడ్డకు జన్మనిచ్చారు.
హీరోయిన్ గా ఎన్నో సినిమాలు చేసిన నటి అర్చన.. బిగ్ బాస్ సీజన్ 1లో పాల్గొని తన ఫాలోయింగ్ మరింత పెంచుకుంది. 2019లో జగదీష్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది. జగదీష్ హైదరాబాద్ లోని హెల్త్ కేర్ ప్రొఫెషనల్ గా పని చేస్తున్నారు.
'కళ్యాణ వైభోగం' సీరియల్ నటి మేఘన లోకేష్.. మైసూరుకి చెందిన స్వరూప్ భరద్వాజ్ ని పెళ్లి చేసుకుంది. ఒకప్పటి మాదిరి యాక్టివ్ గా సీరియల్స్ లో కనిపించకుండా.. తన మ్యారీడ్ లైఫ్ ను ఎంజాయ్ చేస్తోంది.
బుల్లితెరపై యాంకర్ గా గుర్తింపు తెచ్చుకున్న వింధ్య విశాఖ రీసెంట్ గా విశాల్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది. అతడు సాఫ్ట్ వేర్ ఇండస్ట్రీలో పని చేస్తున్నారు.
'కార్తీకదీపం' సీరియల్ నటి ప్రేమి విశ్వనాధ్.. ప్రముఖ ఆస్ట్రాలజిస్ట్ వినీత్ భట్ ను వివాహం చేసుకున్నారు. కేరళలో వినీత్ భట్ చాలా ఫేమస్. సినీ, రాజకీయ ప్రముఖులంతా కూడా తన జాతకాల కోసం వినీత్ చుట్టూనే తిరుగుతుంటారు.