Trisha Krishnan: చూపులతో మాయచేస్తోన్న చెన్నై చంద్రం .. అందుకే 40 దాటినా భారీ రెమ్యునరేషన్!
అందం, అభినయంతో తనకంటూ స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకుంది త్రిష. అన్ని భాషల్లో నటించిన త్రిష..ఫేడవుట్ అయిపోయింది అనుకున్న టైమ్ లో మళ్లీ దూసుకొచ్చింది
Download ABP Live App and Watch All Latest Videos
View In Appప్రస్తుతం త్రిష చేతిలో ఆరు ప్రాజెక్టులున్నాయంటే ఆమె ఎంత బిజీగా ఉందో అర్థమవుతోంది.. లేటెస్ట్ గా సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫొటోస్ చూసి ఏముందసలు..అందుకే మరీ క్రేజ్ తగ్గలే అంటున్నారు నెటిజన్లు
1999లో ఓ చిన్న క్యారెక్టర్ తో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది.. ఆ తర్వాత నీ మనసు నాకు తెలుసు సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయింది. ఆ తర్వాత వరుస ఆఫర్స్, హిట్స్ అందుకుంది స్టార్ హీరోయిన్ అయిపోయింది
తెలుగు, తమిళ్, కన్నడ, హిందీ భాషల్లోని స్టార్ హీరోలందరితోనూ నటించింది..ఎఫైర్లకు సంబంధించి చాలా రూమర్స్ వచ్చాయ్ కానీ త్రిష వాటిపై పెద్దగా రియాక్టవలేదు
ప్రస్తుతం త్రిష..విజయ్ తో డేటింగ్ లో ఉన్నట్టు పుకార్లు వస్తున్నాయ్..ఈ మధ్యే ఇద్దరూ కలసి గోవాలో జరిగిన కీర్తి పెళ్లికి వెళ్లారని ఫొటోస్ వైరల్ అయ్యాయ్.
ఎన్ని రూమర్స్ వచ్చినా కానీ...కెరీర్ విషయంలో జాగ్రత్తగా ఉంటోంది త్రిష. వచ్చిన అవకాశాలు సద్వినియోగం చేసుకుని దూసుకెళుతోంది
కెరీర్ ఆరంభంలో ఎంత తీసుకుంది అన్న విషయం పక్కనపెడితే.. ప్రస్తుతం ఓ సినిమాకు అందులో క్యారెక్టర్ బట్టి కోటి నుంచి నాలుగు కోట్లు డిమాండ్ చేస్తోంది చెన్నై చంద్రం