Heroines After Weight loss : బక్కచిక్కిపోయిన ముద్దుగుమ్మలు!
ఒకప్పుడు హీరోయిన్లు చాలా బొద్దుగా, ముద్దుగా ఉండేవారు. సావిత్రి నుండి సౌందర్య వరకు ఇండస్ట్రీను ఏలిన హీరోయిన్లంతా కూడా కాస్త బొద్దుగానే కనిపించేవారు. కానీ తరువాత ట్రెండ్ మారింది. జీరో సైజ్ ఫ్యాషన్ అయిపోయింది. దీంతో హీరోయిన్లు స్లిమ్ గా కనిపించడం కోసం స్పెషల్ డైట్లు, వ్యాయామాలు అంటూ తెగ ప్రయత్నిస్తుంటారు. ఈ మధ్యకాలంలో కాస్త బొద్దుగా కనిపించే మెహ్రీన్, కీర్తి సురేష్, షాలిని పాండే లాంటి తారలు మరీ బక్కపలచగా తరయారయ్యారు. వారి లుక్స్ ను చూసిన ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. పేషంట్స్ లా ఉన్నారంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఆ తారలపై ఓ లుక్కేద్దాం!
Download ABP Live App and Watch All Latest Videos
View In Appరకుల్ ప్రీత్ సింగ్ : ఈమె ఫిట్నెస్ ఫ్రీక్ అనే సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఈ మధ్యకాలంలో ఆమె మరీ బక్కచిక్కిపోయింది. బాలీవుడ్ లో సినిమాలు చేస్తుండడంతో అమ్మడు తన బరువు మరింత తగ్గించుకుందని తెలుస్తోంది.
మెహ్రీన్ : 'కృష్ణగాడి వీర ప్రేమ గాథ' సినిమాలో మెహ్రీన్ ను చూసిన యూత్ ఫిదా అయిపోయారు. ఆ తరువాత అమ్మడు మరింత బొద్దుగా కనిపించింది. దీంతో ఆఫర్లు కాస్త తగ్గాయి. అందుకే ఇప్పుడు స్లిమ్ గా మారిపోయి.. సరికొత్త లుక్ తో దర్శకనిర్మాతలను ఆకర్షిస్తోంది.
షాలిని పాండే : 'అర్జున్ రెడ్డి' సినిమా తరువాత ఈ బ్యూటీ తన బరువు బాగా తగ్గించుకుంది. ఇప్పుడు ఎంతలా సన్నబడిందంటే ఆమె ఎముకలు కూడా బయటకి కనిపిస్తున్నాయి. షాలిని కొత్త లుక్ ఫ్యాన్స్ ను నచ్చినట్లు లేదు. ఆమెని ట్రోల్ చేస్తూ కామెంట్స్ చేస్తున్నారు.
కీర్తి సురేష్ : 'మహానటి' సినిమా కోసం కీర్తి బాగా బరువు పెరిగింది. ఆ తరువాత బాగా సన్నబడిపోయింది. ఇప్పుడు కీర్తిని చూసిన వారంతా షాకైపోతున్నారు.