Tollywood: రూ.100 కోట్లు కాదు.. 'అంతకుమించి'!
ఒకప్పుడు టాలీవుడ్ సినిమాలు వంద కోట్లు కలెక్ట్ చేశాయంటే విశేషంగా చెప్పుకునేవారు. కానీ ఈ మధ్యకాలంలో వంద కోట్లు మార్క్ అనేది చాలా ఈజీగా దాటేస్తున్నారు. ప్రభాస్ తన సినిమాకే వంద కోట్లు రెమ్యునరేషన్ గా తీసుకుంటున్నాడంటే ఇక సినిమా బడ్జెట్, దాని కలెక్షన్స్ ఏ రేంజ్ లో ఉంటాయో చెప్పనక్కర్లేదు. ఇప్పుడు ప్రభాస్ సినిమాలను పక్కన పెడితే.. టాలీవుడ్ లో వంద కోట్లు సంపాదించే స్టామినా ఉన్న సినిమాలేవో ఇప్పుడు చూద్దాం!
Download ABP Live App and Watch All Latest Videos
View In Appఆచార్య : మెగాస్టార్ చిరంజీవి-కొరటాల శివ కాంబినేషన్ లో తెరకెక్కుతోన్న ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. వీలైనంత త్వరగా షూటింగ్ పూర్తి చేసి దసరాకు సినిమాను విడుదల చేయాలనుకుంటున్నారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించడం ఖాయమని అభిమానులు నమ్ముతున్నారు. చిరు, కొరటాల ట్రాక్ రికార్డ్స్ చూస్తే ఈ సినిమా పక్కా పైసా వసూల్ అనే అనిపిస్తుంది.
అఖండ : 'సింహ', 'లెజెండ్' లాంటి సినిమాల తరువాత బాలయ్య-బోయపాటి కాంబినేషన్ లో వస్తోన్న సినిమా ఇది. ఈ ఒక్క హైప్ తోనే సినిమా వంద కోట్ల మార్క్ అందుకోవడం ఖాయం.
సర్కారు వారి పాట : సూపర్ స్టార్ మహేష్ బాబు - పరశురామ్ కాంబినేషన్ లో తెరకెక్కుతోన్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. గతంలో పరశురామ్ డైరెక్ట్ చేసిన 'గీత గోవిందం' సినిమా వంద కోట్ల క్లబ్ లో చేరింది. ఈసారి మహేష్ బాబుతో సినిమా తీస్తున్నారంటే ఏ రేంజ్ లో ఉంటుందో చెప్పనక్కర్లేదు.
లైగర్ : యంగ్ సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ నటిస్తోన్న ఈ పాన్ ఇండియా సినిమాపై అంచనాలు ఓ రేంజ్ లో ఉంది. ఇప్పటికే వంద కోట్ల క్లబ్ లో చేరిన విజయ్.. ఈసారి అంతకుమించిన రికార్డులు సృష్టించడం ఖాయం.
నారప్ప : వెంకీ నటిస్తోన్న ఈ సినిమాపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. కానీ ఇప్పుడు ఈ సినిమాను ఓటీటీలో రిలీజ్ చేస్తారని అంటున్నారు. అలా కాకుండా ఈ సినిమా కూడా థియేటర్ లోకి వస్తే వంద కోట్ల మార్క్ ఈజీగా అందుకుంటుంది.
పుష్ప : 'అల వైకుంఠపురంలో' సినిమాతో నాన్ బాహుబలి రికార్డులు కొల్లగొట్టిన బన్నీ ఈసారి పాన్ ఇండియా సినిమా చేస్తున్నారు. ఈ సినిమా వంద నుండి ఐదు వంద కోట్ల వరకు వసూళ్లు రాబడుతుందని అంచనా వేస్తున్నారు.
హరిహర వీరమల్లు : క్రిష్-పవన్ కాంబినేషన్ లో వస్తోన్న పాన్ ఇండియా ప్రాజెక్ట్ ఇది. రీసెంట్ గా చిన్న టీజర్ వదిలి సినిమాపై అంచనాలను మరింత పెంచేశాడు క్రిష్. ఈ సినిమా వంద కోట్లకు మించి వసూలు చేస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు.
ఆర్ఆర్ఆర్ : జక్కన్న రూపొందిస్తోన్న ఈ సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇది ఎన్ని కోట్లు వసూలు చేస్తుందనేది మన ఊహకు కూడా అందదు.
టక్ జగదీష్ : సాధారణంగా నాని సినిమాలు యాభై కోట్ల మార్క్ ను ఈజీగా దాటేస్తాయి. అయితే ఈసారి మాత్రం నాని వంద కోట్ల మార్క్ అందుకోవడం ఖాయమని అంటున్నారు. శివ నిర్వాణ డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమా ఫ్యాన్స్ కు ఫుల్ మీల్స్ అని.. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా భారీ కలెక్షన్స్ వసూలు చేస్తుందని అంటున్నారు.