✕
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • ఆట
  • వెబ్ స్టోరీస్
  • ఫోటో గ్యాలరీ
  • ఫ్యాక్ట్ చెక్
  • బిగ్‌బాస్
  • సినిమా
  • టీవీ
  • సినిమా రివ్యూ
  • ఓటీటీ-వెబ్‌సిరీస్‌
  • పర్సనల్ ఫైనాన్స్
  • ఐపీవో
  • మ్యూచువల్ ఫండ్స్
  • ఆటో
  • మొబైల్స్‌
  • టీవీ
  • గాడ్జెట్స్
  • ల్యాప్‌టాప్
  • వాస్తు
  • శుభసమయం
  • ఫుడ్ కార్నర్
  • ఆరోగ్యం
  • ఆయుర్వేదం
  • ఎడ్యుకేషన్
  • వెబ్ స్టోరీస్
  • ఇండియా
  • యువ
  • క్రైమ్
  • జాబ్స్
  • ట్రెండింగ్
  • రైతు దేశం
  • పాలిటిక్స్
  • న్యూస్
  • ప్రపంచం
  • హైదరాబాద్
  • అమరావతి
  • విశాఖపట్నం
  • విజయవాడ
  • రాజమండ్రి
  • కర్నూల్
  • తిరుపతి
  • నెల్లూరు
  • వరంగల్
  • నల్గొండ
  • కరీంనగర్
  • నిజామాబాద్

South Indian Celebrities : ఎంగేజ్మెంట్ కి 'ఎస్'.. పెళ్లికి 'నో'!

ABP Desam   |  05 Jul 2021 11:28 AM (IST)
1

ఎంతో ఇష్టపడి చేసుకున్న పెళ్లిళ్లు ఒక్కోసారి పెటాకులు అవుతుంటాయి. వ్యక్తిగత కారణాలు ఏవైనా.. మన తారలు విడాకులు, బ్రేకప్ సంగతి హాట్ టాపిక్ అవుతుంటాయి. పెళ్లి తరువాత విడాకులు తీసుకున్న వారు కొందరైతే.. పెళ్లికి సిద్ధపడి ఎంగేజ్మెంట్ చేసుకున్న తరువాత మరికొందరు డ్రాప్ అయిపోతున్నారు. అలా నిశ్చితార్ధం చేసుకొని పెళ్లి క్యాన్సిల్ చేసుకున్న తారలెవరో ఇప్పుడు చూద్దాం!

2

మార్చిలో ఎంగేజ్మెంట్ చేసుకున్న మెహ్రీన్ ఇప్పుడు తన పెళ్లిని క్యాన్సిల్ చేసుకుంది. ఈ విషయం టాలీవుడ్ లో చర్చనీయాంశమైంది. రాజకీయ కుటుంబానికి చెందిన భవ్య బిష్ణోయ్ తో మెహ్రీన్ ని నిశ్చితార్ధం జరిగింది. జైపూర్ లో ఈ వేడుకలకు ఎంతో గ్రాండ్ గా చేసుకున్నారు. కోవిడ్ కారణంగా పెళ్లి వచ్చే ఏడాదిలో చేసుకుందాం అనుకున్నారు. కానీ ఇంతలో ఊహించని విధంగా పెళ్లి చేసుకోకూడదని నిర్ణయించుకున్నారు. తమ ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ చేసుకున్నట్లు ప్రకటించింది ఈ జంట. 

3

గతంలో స్టార్ హీరోయిన్ రష్మిక కూడా తన ఎంగేజ్మెంట్ ను క్యాన్సిల్ చేసింది. ప్రముఖ నటుడు, దర్శకుడు రక్షిత్ శెట్టిని ప్రేమించిన రష్మిక అతడితో పెళ్లికి రెడీ అయింది. వీరిద్దరికీ ఎంగేజ్మెంట్ జరిపించారు పెద్దలు. అదే సమయంలో రష్మికకు టాలీవుడ్ లో అవకాశాలు రావడంతో నటిగా బిజీ అయింది రష్మిక. ఈ క్రమంలో తన పెళ్లి క్యాన్సిల్ చేసుకుంటున్నట్లు ప్రకటించి షాకిచ్చింది ఈ బ్యూటీ. 

4

ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన కొన్ని రోజులకే అక్కినేని అఖిల్ తను ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకున్నారు. రెండు సంవత్సరాల పాటు శ్రేయా భూపాల్ తో డేటింగ్ చేసిన అఖిల్ ఫైనల్ గా ఎంగేజ్మెంట్ చేసుకున్నాడు. కానీ ఈ బంధం పెళ్లి వరకు వెళ్లలేదు. ఆ తరువాత శ్రేయాభూపాల్ మరో వ్యక్తిని పెళ్లి చేసుకుంది. 

5

ఇక టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా చెలామణి అయిన త్రిషకి.. చెన్నైకి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త వరుణ్ మణియన్ తో నిశ్చితార్ధం జరిగింది. ఆ తర్వాత ఏమైందో కానీ పెళ్లి మాత్రం జరగలేదు. ఎంగేజ్మెంట్ అయిన కొన్నాళ్లకే ఈ జంట విడిపోయింది. 

6

కోలీవుడ్ టాప్ హీరో విశాల్ కి హైదరాబాద్ కు చెందిన అనీషారెడ్డితో నిశ్చితార్ధం జరిగింది. ఆ తరువాత ఈ ఇద్దరి పెళ్లి ఊసే లేదు. 

7

విఘ్నేష్ శివన్ కు ముందు నయనతార.. ప్రముఖ కొరియోగ్రాఫర్, డైరెక్టర్ ప్రభుదేవాను ప్రేమించింది. అప్పట్లో వారిద్దరికీ ఎంగేజ్మెంట్ జరిగిందని ప్రచారం జరిగింది. కానీ నిజమేంటో బయటకు రాలేదు. పెళ్లి చేసుకుందామనుకున్న ఈ జంట కొన్ని కారణాల వలన ఒకరికొకరు దూరమయ్యారు. 

8

హీరోయిన్ ఇలియానా చాలాకాలం పాటు ఆండ్రూ నీబోన్ అనే విదేశీ ఫోటోగ్రాఫర్ తో డేటింగ్ చేసింది. వీరిద్దరూ ఒకే ఇంట్లో కలిసి ఉండేవారు. ఆ సమయంలో వీరికి ఎంగేజ్మెంట్ జరిగిందని.. పెళ్లి కూడా చేసుకున్నారని వార్తలు వచ్చాయి. కానీ కొన్ని కారణాలతో ఈ జంట విడిపోయింది. 

  • హోమ్
  • ఫోటో గ్యాలరీ
  • ఎంటర్‌టైన్‌మెంట్‌
  • South Indian Celebrities : ఎంగేజ్మెంట్ కి 'ఎస్'.. పెళ్లికి 'నో'!
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.