Sreemukhi : ఫ్లోరల్ లెహంగాలో కలర్ఫుల్గా ముస్తాబైన శ్రీముఖి.. సంగీత్ వంటి ఫంక్షన్స్‌కి మీరు ట్రై చేయొచ్చు
పెళ్లిళ్ల సీజన్ ప్రారంభమైపోయింది. ఈ సమయంలో పలు రకాల ఈవెంట్స్ జరుగుతూ ఉంటాయి. అయితే మీరు శ్రీముఖి ధరించిన ఫ్లోరల్ లెహంగా ఫంక్షన్లకు మంచి ఎంపిక అవుతుంది. (Images Source : Instagram/Sreemukhi)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appఫ్లోరల్ లెహంగా ధరించి.. దానిపై పొడుగైన, తేలికైన ఫ్లోరల్ కోట్ ధరించింది. ఈ డిజైన్ లెహంగా ఈవెంట్లకు, ఫంక్షన్లకు చక్కగా నప్పుతుంది. (Images Source : Instagram/Sreemukhi)
డ్రెస్‌కి తగ్గట్లు హెవీ కాకుండా.. సింపుల్ జ్యూవెలరీని మ్యాచ్ చేసింది శ్రీముఖి. మెడలో పచ్చల గొలుసు, చెవులకు మ్యాచింగ్ జ్యూవెలరీ.. పాపిడి బిళ్లగా వైట్ స్టోన్స్ చైన్‌ని పెట్టుకుంది.(Images Source : Instagram/Sreemukhi)
జుట్టును లో పోనిటైల్గా వేసుకుని.. మెరిసే, గోల్డెన్ మేకప్ లుక్‌లో శ్రీముఖి అందంగా ముస్తాబై ఫోటోలకు ఫోజులిచ్చింది. వీటిని ఇన్‌స్టాలో షేర్ చేస్తూ.. KBKG on @starmaa ❤️✨ అంటూ క్యాప్షన్ ఇచ్చింది.(Images Source : Instagram/Sreemukhi)
మాటీవీలో ప్రసారమవుతున్న ఓ షో కోసం శ్రీముఖి ఇలా ముస్తాబైంది. ఈ లుక్స్‌లో చాలా బాగున్నావంటూ ఆమె అభిమానులు కామెంట్లు పెడుతున్నారు. (Images Source : Instagram/Sreemukhi)
శ్రీముఖి యాంకర్‌గా కెరీర్‌ను సక్సెస్‌ఫుల్‌గా ముందుకు తీసుకెళ్తుంది. యూట్యూబ్ ద్వారా కూడా ఈ భామ తన అభిమానులు అలరిస్తూనే ఉంది. (Images Source : Instagram/Sreemukhi)